Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2020లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు తెలుసా..?

2020లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు తెలుసా..?
, గురువారం, 2 జనవరి 2020 (17:31 IST)
గతేడాది భారత క్రికెట్ జట్టు ఒక్క ప్రపంచ కప్ మినహా అత్యధిక విజయాలను నమోదు చేసుకుంది. జట్టులో బ్యాట్స్‌మెన్‌లు, అలాగే బౌలర్‌లు సమిష్టిగా రాణించి జట్టును ఉత్తమ జట్టుగా నిలిపారు. అయితే ఇదే ఆటతీరుతో 2020లోనూ తమ విజయపరంపరను కొనసాగించాలని భావిస్తుంది.

ఈ ఏడాదిలో ముందుగా శ్రీలంక జట్టుతో జనవరి 5వ తేదీ నుంచి మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడుతుంది. అలాగే ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటనలో టెస్టు, వన్డే , టీ20 సిరీస్‌లు ఆడుతుంది. మార్చిలో ఎటూ ఐపీఎల్‌ ఆడాల్సి ఉంటుంది. ఇక జూన్‌లో శ్రీలంకతో మరోసారి సిరీస్‌లు మొదలవుతాయి. ఆగస్టు నెలలో జింబాబ్వేతో భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.

సెప్టెంబర్‌లో టీమిండియా ఆసియా కప్‌ ఆడుతుంది. అలాగే ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. అక్టోబర్‌లోనే టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. భారత జట్టు ఈ ఏడాది ఆసియా కప్‌తో పాటు టీ20పై దృష్టి సారించింది. టీమిండియా ఆడనున్న మ్యాచ్‌లకు సంబంధించిన ఈ ఏడాది క్యాలెండర్‌ను మీరూ ఒకసారి చూడండి..
 
* జనవరి 5 - శ్రీలంక తొలి టి20 (గువాహటి) 
* జనవరి 7 - శ్రీలంక రెండో టి20 (ఇండోర్‌) 
* జనవరి 10 - శ్రీలంక మూడో టి20 (పుణే) 
* జనవరి 14 - ఆస్ట్రేలియా తొలి వన్డే (ముంబై) 
* జనవరి 17 - ఆస్ట్రేలియా రెండో వన్డే (రాజ్‌కోట్‌) 
 
* జనవరి 19 - ఆస్ట్రేలియా మూడో వన్డే (బెంగళూరు) 
* జనవరి 24 - న్యూజిలాండ్‌ తొలి టి20 (ఆక్లాండ్‌) 
* జనవరి 26 - న్యూజిలాండ్ రెండో టి20 (ఆక్లాండ్‌) 
* జనవరి 29 - న్యూజిలాండ్ మూడో టి20 (హామిల్టన్‌) 
* జనవరి 31 - న్యూజిలాండ్‌ నాలుగో టి20 (వెల్లింగ్టన్‌) 
 
* ఫిబ్రవరి 2 - న్యూజిలాండ్‌ ఐదో టి20 (మౌంట్‌ మాంగనీ) 
* ఫిబ్రవరి 05 - న్యూజిలాండ్‌ తొలి వన్డే (హామిల్టన్‌) 
* ఫిబ్రవరి 08 - న్యూజిలాండ్‌ రెండో వన్డే (ఆక్లాండ్‌) 
* ఫిబ్రవరి 11 - న్యూజిలాండ్ మూడో వన్డే (మౌంట్‌ మాంగనీ) 
* ఫిబ్రవరి 21- న్యూజిలాండ్‌ తొలి టెస్టు (వెల్లింగ్టన్‌) 
* ఫిబ్రవరి 29 - న్యూజిలాండ్ రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్‌) 
 
* మార్చి 12 - దక్షిణాఫ్రికా తొలి టి20 (ధర్మశాల) 
* మార్చి 15 - దక్షిణాఫ్రికా రెండో టి20 (లక్నో) 
* మార్చి 18 - దక్షిణాఫ్రికా మూడో టి20 (కోల్‌కతా) 
 
* ఏప్రిల్‌ - ఐపీఎల్‌ సీజన్ 
* జూన్‌ - శ్రీలంకలో టీమిండియా పర్యటన 3 వన్డేలు, 3 టీ20ల మ్యాచ్ 
* ఆగస్టు - జింబాబ్వేలో భారత జట్టు పర్యటన (3 వన్డేలు) 
* సెప్టెంబర్ - ఆసియా కప్‌ టోర్నీ 
 
* సెప్టెంబర్‌ - భారత్‌లో ఇంగ్లండ్‌ జట్టు పర్యటన (3 వన్డేలు, 2 టి20లు) 
* అక్టోబర్ - ఆస్ట్రేలియాలో టీమిండియా జట్టు పర్యటన (3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుత్తా జ్వాల-విష్ణువర్ధన్ ప్రేమాయణం.. భార్యకు విడాకులిచ్చింది.. అందుకేనా? (video)