తన కోపమే తన శత్రువు... సౌతాఫ్రికా క్రికెటర్‌కు సరిగ్గా సూటైంది...

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (19:45 IST)
తన కోపమే తన శత్రువు అన్నది పెద్దల మాట. ఎవరైనా కోపగించుకుంటే వారిని చూసి పెద్దలు అంటుంటారు. ఈ సామెత సరిగ్గా సౌతాఫ్రికా క్రికెటర్‌కు సూటైంది. భారత బౌలర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఔట్ కావడాన్ని జీర్ణించుకోలేని సౌతాఫ్రికా క్రికెటర్ డ్రెస్సింగ్ రూంకెళ్లి గోడను బలంగా కొట్టి చేతిని విరగ్గొట్టుకున్నాడు. ఫలితంగా మూడో టెస్ట్ మ్యాచ్‌కు దూరమై జట్టుకు కష్టాలు తెచ్చిపెట్టాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రస్తుతం సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. అయితే, రెండో టెస్ట్ మ్యాచ్‌లో సఫారీ ఓపెనర్ ఐడెన్ మార్ క్రమ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పేలవంగా అవుటయ్యాడు. 
 
ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. టీవీ రీప్లేలో అది నాటౌట్ అని తేలడంతో కోపం భరించలేక డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న గోడను బలంగా గుద్దాడు. దాంతో మార్ క్రమ్ చేతికి బలమైన గాయం అయింది. 
 
మణికట్టులో పగులు రావడమే కాదు, కొన్ని చేతివేళ్ల ఎముకలు చిట్లినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో శనివారం ప్రారంభమయ్యే మూడో టెస్టులో మార్ క్రమ్ అందుబాటులో లేకుండా పోయినట్టు సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్ వర్గాలు అంటున్నాయి. పైగా, మార్ క్రమ్ చికిత్స కోసం స్వదేశానికి పయనం కానున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

తర్వాతి కథనం
Show comments