Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణాఫ్రికాకు ఓటమి ఖాయం.. అదరగొట్టిన టీమిండియా బౌలర్లు

Advertiesment
దక్షిణాఫ్రికాకు ఓటమి ఖాయం.. అదరగొట్టిన టీమిండియా బౌలర్లు
, ఆదివారం, 13 అక్టోబరు 2019 (13:31 IST)
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆటలో భాగంగా నాలుగో రోజైన ఆదివారం వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఫాలోఆన్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 21 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
 
ఉమేశ్‌యాదవ్‌ వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతి లెగ్‌సైడ్‌ వెళ్లినా డిబ్రుయిన్‌(8) షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్‌కు తగిలిన బంతి వికెట్ల వెనుక నుంచి దూరంగా వెళుతున్న క్యాచ్‌ను సాహా తనదైన మార్కుతో అందుకున్నాడు. డైవ్ చేసి మరీ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్‌తో వృద్ధిమాన్ సాహా అందరినీ ఆశ్చర్యపరిచాడు.
 
అలాగే 24వ ఓవర్‌లో కెప్టెన్‌ డుప్లెసిస్‌(5)ను పెవిలియన్‌కు పంపాడు. అశ్విన్‌ వేసిన 24 ఓవర్‌ మూడో బంతి డుప్లెసిస్‌ బ్యాట్‌కు తగిలింది. ఆ సమయంలో వికెట్లకు దగ్గరగా ఉన్న సాహా చేతుల్లోంచి బంతి చేజారిపోయిందని అనిపించింది. అయితే, తక్కువ ఎత్తులో వచ్చిన బంతి తన చేతుల్లోంచి రెండు సార్లు జారిపోయినా మూడోసారి మాత్రం సాహా ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ క్యాచ్‌తో సాహా అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు.
 
ఫలితంగా పూణె వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్ విరామ సమయానికి దక్షిణాఫ్రికా 27 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. మరోవైపు ఈ టెస్టులో టీమిండియా విజయానికి ఇంకా ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. 
webdunia
 
కాగా దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 601/5 వద్ద డిక్లేర్డ్‌ చేయడంతో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌లో పడింది. భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీయగా, ఇశాంత్, ఉమేశ్ యాదవ్, జడేజాలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు. ఇంకా 246 పరుగులు వెనుకబడి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంపైర్ వేలెత్తాడు, మార్ క్రమ్ డీఆర్ఎస్ కోరలేదు ఎందుకని? దక్షిణాఫ్రికా ఫాలోఆన్