Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణాఫ్రికాపై టీమిండియా అదుర్స్-137 పరుగుల తేడాతో భారీ విజయం

Advertiesment
దక్షిణాఫ్రికాపై టీమిండియా అదుర్స్-137 పరుగుల తేడాతో భారీ విజయం
, ఆదివారం, 13 అక్టోబరు 2019 (15:25 IST)
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం ఫాలోఆన్ ఆడిన దక్షిణాఫ్రికా జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. తద్వారా పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
ఫాలోఆన్ ఆడిన దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 
 
విశాఖ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ (3/22), రవీంజ్ర జడేజా (3/52) అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు మూడో టెస్టు నెల 19 నుంచి రాంచీలో జరుగనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ సూపర్ క్యాచ్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు పాదాభివందనం వీడియోలు వైరల్