పూజా హెగ్దె కోసం పట్టుబట్టిన ప్రభాస్? ఆమెకి ఎక్కడో సుడి వుందంటున్న సినీ జనం

మంగళవారం, 15 అక్టోబరు 2019 (19:08 IST)
పూజా హెగ్దే కాల్షీట్లు ఇప్పుడు పెట్రోలులా మండిపోతున్నాయి. ఆమె కాల్షీట్ కావాలంటే కోట్లు సమర్పించుకోవాల్సిందేనంటున్నారు ఫిలిం నగర్ జనం. ఈమధ్యనే 15 రోజుల కాల్షీట్ ఇచ్చేందుకు పూజా హెగ్దె ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. 
 
ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ జాన్ చిత్రం కోసం పూజా హెగ్దెను సంప్రదిస్తే.... ఎలాంటి ఆలోచన లేకుండా రూ. 2 కోట్లు ఇస్తేనే చేస్తానని చెప్పేసిందట. దీనితో బెంబేలెత్తిపోయిన నిర్మాతలు విషయాన్ని ప్రభాస్ దృష్టికి తీస్కెళ్లారట. ఆమె స్థానంలో మరో హీరోయిన్ చూసుకుందామని చెప్పారట. అందుకు ప్రభాస్ మాత్రం ససేమిరా అన్నాడట.
 
తన పక్కన పొట్టి హీరోయిన్లు సెట్ కారనీ, పూజా హెగ్దె అయితేనే సరిపోతుందనీ, పైగా ప్రస్తుతం ఆమె హవా నడుస్తుంది కనుక ఎన్ని కోట్లడినా ఆమెను బుక్ చేయమని చెప్పాడట బాహుబలి. దిమ్మతిరిగే పారితోషికం అడిగినా ఆమెనే బుక్ చేయక తప్పడంలేదట. ఏం చేస్తాం... పూజా హెగ్దెకి ఎక్కడో సుడి వుందంటున్నారు సినీజనం.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చెర్రీ... నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఇప్పటికైనా అది కాస్త పెంచు: జక్కన్న సీరియస్ వార్నింగ్?