Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్జున్ 19: అల వైకుంఠపురంలో బన్నీ డ్రైవర్ కుమారుడా??

Advertiesment
Allu Arjun
, గురువారం, 10 అక్టోబరు 2019 (16:33 IST)
జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం ''అల వైకుంఠపురంలో''. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. బన్నీ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. నివేతా పేతురాజ్ మరో హీరోయిన్‌. 
 
టబు, జయరాం, సుశాంత్‌, మురళీ శర్మ, హర్షవర్థన్, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే విడుదలైంది. అలాగే సామజవరగమన అనే పాటను కూడా సినిమా యూనిట్ విడుదల చేసింది. గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నాడు.
 
ఇదిలా ఉంటే.. అల వైకుంఠపురంలో కథ ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అలా వైకుంఠపురంలో అనే ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటాయి. అందులో ఒకటి యజమాని కుటుంబం కాగా మరొకటి డ్రైవర్ కుటుంబం. కానీ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటారు. ఇద్దరికీ ఒకేసారి మగపిల్లలు పుడతారు.
 
అందులో ఒకరు యజమాని కొడుకు అల్లు అర్జున్ కాగా, డ్రైవర్ కొడుకు సుశాంత్... కానీ వీరి భవిషత్తుపై చర్చ వచ్చినప్పుడు మాత్రం డ్రైవర్ మాట్లాడుతూ డ్రైవర్ కొడుకు డ్రైవరే అవుతాడని అంటాడు. ఈ క్రమంలో డ్రైవర్ కొడుకును యజమాని, యజమాని కొడుకును డ్రైవర్ తీసుకుని పెంచుకుంటారని టాక్ వస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినాయక్ మాస్ లుక్.. సీనయ్యగా వస్తోన్న వీవీవీ