తెలుగు చిత్రపరిశ్రమలో జిగేల్‌రాణిగా మంచి గుర్తింపుపొందిన హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగులో అడుగుపెట్టి.. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. కానీ, బాలీవుడ్‌లో ఈ అమ్మడు పాచికలు పారలేదు. ఈ క్రమంలో తెలుగునే నమ్ముకుంది. అయితే, తెలుగులో ఆమెకి మళ్లీ ఛాన్సులు రావడం .. నిలదొక్కుకోవడం కష్టమేనని అంతా భావించారు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	కానీ, 'అరవింద సమేత', 'మహర్షి', 'గద్దలకొండ గణేశ్' చిత్రాల విజయాలు ఆమె స్థాయిని పెంచుతూ వచ్చాయి. అందుకు తగినట్టుగానే ఆమె తన పారితోషికాన్ని పెంచుతూ రావడం విశేషం. 
 
									
										
								
																	
	 
	'గద్దలకొండ గణేశ్' సినిమా కోసం కోటికిపైగా పారితోషికాన్ని అందుకున్న ఆమె, ప్రస్తుతం ప్రభాస్ జోడీగా చేస్తోన్న సినిమా కోసం రూ.2 కోట్లకి పైగా తీసుకుంటోందట. 'అల వైకుంఠపురములో' హిట్ అయితే ఆమె పారితోషికం రూ.3 కోట్లకు చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	మొత్తంమీద తెలుగులో రంగస్థలం చిత్రంలో జిగేల్ రాణి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన పూజాహెగ్డే... ఇపుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోందన్నమాట.