Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోటీశ్వరులపై బ్యాంకుల ఉదారత.. రూ.1.76 లక్షల కోట్ల రుణాలు కొట్టివేత

కోటీశ్వరులపై బ్యాంకుల ఉదారత.. రూ.1.76 లక్షల కోట్ల రుణాలు కొట్టివేత
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (11:19 IST)
దేశంలోని కోటీశ్వరుల పాలిట బ్యాంకులు మరోమారు ఉదారతను ప్రదర్శించాయి. గత మూడేళ్ళలో మొండిబాకీలను రూ.1.76 లక్షల కోట్లను బ్యాంకులు కొట్టివేశాయి. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. 
 
సమాచార హక్కు చట్టానికి లోబడి ఆర్‌బీఐ నుంచి ఓ ఆంగ్ల చానెల్‌ పొందిన సమాచారం ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల కొట్టివేతలు బాగా పెరిగాయి. 
 
2015-18 మధ్యకాలంలో షెడ్యూలు కమర్షియల్‌ బ్యాంకులు రూ.2.17 లక్షల బకాయిలను కొట్టివేశాయి. పెద్ద నోట్ల రద్దు (2016 నవంబరు 8) తర్వాత రైట్‌ ఆఫ్‌లు శరవేగంగా పెరిగాయి. ప్రభుత్వ బ్యాంకులకు రూ.500 కోట్లకు పైగా ఎగవేసిన వారు 88 మందని, వీరంతా ఎగవేసిన మొత్తం రూ.1.07 లక్షల కోట్లని తెలిసింది. 
 
అంటే, సగటున ఒక్కో డిఫాల్టర్‌ ఎగవేసిన మొత్తం రూ.1,220 కోట్లు. ఎస్‌బీఐకి ఈ మార్చి 31 నాటికి 220 మంది రూ.100 కోట్లకు పైగా ఎగవేశారు. వీరు ఎగవేసిన మొత్తం రూ.76,600 కోట్లు. కనీసం రూ.500 కోట్లకు పైగా బకాయిపడ్డ 33 మంది ఎగవేసిన మొత్తం రూ.37,700 కోట్లు. 
 
అలా గత మూడేళ్ళలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ రూ.1.76 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను రైటాఫ్ (ఖాతాల్లోంచి కొట్టివేయడం) చేసింది. ఈ బకాయిలన్నీ రూ.100 కోట్లు లేదా అంతకుపైగా ఎగవేసిన 416 మంది రుణగ్రహీతలవే కావడం గమనార్హం. సగటున ఒక్కొక్కరూ ఎగవేసిన మొత్తం రూ.424 కోట్లు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థాయ్‌లాండ్‌లో చనిపోయిన ఇండియన్ టెక్కీ