Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

14 మంది అమ్మాయిలని లొంగదీసుకుని ఎంజాయ్... బార్బీ గర్ల్ 5 చితక్కొట్టేసింది...

14 మంది అమ్మాయిలని లొంగదీసుకుని ఎంజాయ్... బార్బీ గర్ల్ 5 చితక్కొట్టేసింది...
, శుక్రవారం, 4 అక్టోబరు 2019 (22:15 IST)
14మంది అమ్మాయిలతో ప్రేమాయణం. అందరూ ఒకేసారి రావడంతో అతను ఏమయ్యాడో తెలుసా.. ఒకబ్బాయి ఒక అమ్మాయిని మెయింటైన్ చేయడమే కష్టం. లవర్ అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్..2 చిత్రంలో చాలా ఫన్నీగా చూపించాడు. 
 
అలాంటి ఒక వ్యక్తి ఏకంగా 14 మంది అమ్మాయిలను పడేశాడు. వారితో తెగ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. 14 మంది అమ్మాయిలను ఫ్లాట్ చేసిన కుర్రాడి వయస్సు ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. అతని వయస్సు కేవలం 18 యేళ్ళే. ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం సాగించిన ఇతగాడి బండారం బట్టబయలైంది.
 
బెంగుళూరులోని ఇందిరానగర్‌లో రహీమ్ అనే 18 యేళ్ళ కుర్రాడు 14 మంది అమ్మాయిలతో ప్రేమను ఎంజాయ్ చేస్తూ హాయిగా  జీవితాన్ని గడిపేవాడు. అమ్మాయిలందరూ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైనవాళ్లే. ఇలాంటి సమయంలో ఒక అమ్మాయికి అనుమానం వచ్చింది. ఫోన్లో అతను వేర్వేరు అమ్మాయితో మాట్లాడుతున్నాడని తెలుసుకుని అతని ఫోన్‌ను చాటుగా చూసింది. అందులో తన నెంబర్ బార్బీ గర్ల్ 5 అని ఫీడ్ చేసి ఉంది. అలా బార్బీ గర్ల్ 14 నెంబర్లు ఉన్నాయి. రహీమ్‌కు కూడా తెలియకుండా 14 మంది నెంబర్లు తీసుకుంది. అందరికీ ఫోన్ చేసి మాట్లాడింది. 
 
రెండురోజుల క్రితం రహీమ్ నివాసముండే ఇంటికి ఒక్కసారిగా అందరూ కలిసి వచ్చారు. రహీమ్‌ను చితకబాదారు. ప్రేమ పేరుతో మోసం చేస్తున్న రహీమ్ ను పోలీసులకు అప్పగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్యావరణ హితం సేంద్రీయ వ్యవసాయం... ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్