అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పియూష్ చావ్లా!!

ఠాగూర్
శుక్రవారం, 6 జూన్ 2025 (16:43 IST)
భారత క్రికెటర్ పియూష్ చావ్లా అన్ని క్రికెట్ ఫార్మెట్ల నుంచి వీడ్కోలు పలికారు. టెస్ట్, వన్డే, టీ20  ఫార్మెట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. 
 
"రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో గడిపిన తర్వాత ఈ అద్భుత ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. భారత జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నుంచి 2007 టీ వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్లలో ఒక సభ్యుడుగా ఉండటం వరకు ఈ ప్రయాణంలోని ప్రతిక్షణం దేవుడు ఆశీర్వాదమే. ఈ జ్ఞాపకాలు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి" అని చావ్లా తన పోస్టులో పేర్కొన్నారు. 
 
కాగా, భారత్ తరపున పియూష్ చావ్లా 2006 నుంచి 2012 మధ్యకాలంలో మూడు టెస్టులు, 25 వన్డేలు, 7టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. అన్ని ఫార్మెట్‌లలో కలిపి మొత్తం 43 వికెట్లు పడగొట్టారు. అలాగే, ఐపీఎల్ పోటీల్లో పంజాబ్, కోల్‌కతా, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments