దేశంలో మళ్లీ 20 వేలుదాటిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (11:38 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా మరో 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా 20 వేలకు దిగువున నమోదవుతూ వచ్చిన ఈ కేసులు.. గడిచిన 24 గంటల్లో 20551గా నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,41,07,588కు చేరుకున్నాయి. వీటిలో 4,34,45,624 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, 526600 మంది మరణించారు. మరో 1,35,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
అదేవిధంగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కరోనా బాధితుల్లో 70 మంది చనిపోగా, మరో 21595 మంది కోలుకున్నారు. ఇకపోతే, రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.50గా ఉన్నాయి. మరణాలు 1.19 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 205.59 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments