Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసు

Advertiesment
coronavirus
దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 19,637 మందికి కోవిడ్-19 సోకిందని తెలిపింది.
 
దీంతో బాధితుల సంఖ్య 4,40,19,811కి చేరింది. గడిచిన 24 గంటల్లో 19,336 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా.. ప్రస్తుతం 1,43,676 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా 45 మరణాలతో, మరణాల సంఖ్య 5,26,357కు పెరిగింది. ఈ మేరకు నివేదికలో పేర్కొంది.
 
ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు మరోమారు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వెల్లడించింది. జూలై 21వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారించారు. అతను ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను కూడా వేయించుకున్నారు. 
 
అయినప్పటికీ ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ నెల 27న జో బిడెన్‌కు పరీక్షలు నిర్వహించి ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఈ సందర్భంలో, బిడెన్‌కు ఈ రోజు (జూలై 31) మళ్లీ కోవిడ్ సోకినట్లు నిర్ధారించబడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్.. ఆగస్టులో సెలవులు ఎన్ని?