Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో మరో 14,830 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Advertiesment
pneumonia after corona
దేశంలో కొత్తగా మరో 14,830 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 4.29 లక్షల మందికి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే, ఈ వైరస్ సోకిన వారిలో 36 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,47,512 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఆరోగ్య బులిటెన్‌లో పేర్కొంది. 
 
ఇకపోతే, ఈ వైరస్ బాధితుల్ల 18159 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం 4,32,46,829 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 5,26,110 మందికి ప్రాణాలు కోల్పోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంకీఫాక్స్ లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్.. గాలి ద్వారా వ్యాపించదు