Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్గిల్ వార్ ఎలా జరిగింది.. ఆ యుద్ధానికి కారణం ఏంటి?

kargil war
, మంగళవారం, 26 జులై 2022 (11:53 IST)
కార్గిల్ వార్ ఎలా జరిగింది.. ఆ యుద్ధానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలంటే.. తాశి నామ్ గ్యాల్ అనే వ్యక్తి.. తన గొర్రెలను మేపేందుకు పర్వత లోయల్లోకి వెళ్లాడు. అయితే అక్కడ జనసంచారం ఉందని తాశి నామ్‌గ్యాల్‌. వెంటనే గుర్తించాడు. అలాగే ఆ ప్రాంతంలో పఠాన్‌ దుస్తుల్లో కొందరు వ్యక్తులు రాళ్లతో మంచులో ఏదో పని చేస్తుండటం చూశాడు. అనుమానం వచ్చి క్షుణ్ణంగా చూస్తే వారి దుస్తుల్లో ఆయుధాలు కనిపించాయి. 
 
క్షణం ఆలస్యం చేయకుండా భారత ఆర్మీకి విషయం చేరవేశాడు నామ్‌గ్యాల్‌. నామ్‌గ్యాల్‌ ఇచ్చిన సమాచారంతో పర్వతాల్లోకి వెళ్లిన ఇండియన్‌ ఆర్మీ ట్రూప్‌పై అనుమానిత వ్యక్తులు దాడి చేశారు. ఐదుగురు భారత సైనికులను పట్టుకుని అత్యంత క్రూరంగా హత్య చేశారు. 
 
ఊహించని విధంగా జరిగిన దాడితో భారత ఆర్మీ మొదట తీవ్రంగా నష్టపోయింది. పాక్‌ దళాల సాయంతో టెర్రరిస్టులు చేసిన దాడిలో కార్గిల్‌ ఆయుధగారం ధ్వంసమైంది. మన ఆర్మీ తేరుకునే లోపే ద్రాస్‌, కక్సర్‌, ముస్తో సెక్టార్లలో శత్రువులు తిష్ట వేశారనే సమాచారం అందింది.
 
దొంగచాటుగా పాక్‌ ఆర్మీ కొండల పైకి చేరుకుని బంకర్లు నిర్మించుకోవడంతో ఈ పోరాటంలో తొలుత భారత సైనికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇలా మే 26న వాయుసేన రంగంలోకి దించింది ఇండియా ప్రభుత్వం. 
 
యుద్ధంలో కీలక ఘట్టం మొదలైంది. వారం రోజుల పాటు హోరాహోరీ పోరు జరిగింది. జులై 4వ తేదిన కీలకమైన టైగర్‌ హిల్స్‌ని భారత్‌ స్వాధీనం చేసుకుంది. దీంతో పాక్‌ ఆర్మీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. తెలుగు వాడైన మేజర్‌ పద్మఫణి ఆచార్య ఈ యుద్ధ క్షేత్రంలోనే అమరులయ్యారు.
 
దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో భారత్‌ వైపు 527 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్‌ వైపు 453 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. ఈ చొరబాట్లలో పాకిస్తాన్‌కి చెందిన స్పెషల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌, నార్తర్న్‌ లైట్‌ఇన్‌ఫాంట్రీ చెందిన సైనికులు పాల్గొన్నట్టు తేలింది. వీరికి కశ్మీరీ తీవ్రవాదులు, ఆఫ్ఘానిస్థాన్‌కి చెందిన కిరాయి మూకలు సహాకరించినట్టు తేలింది.
 
కార్గిల్ విజయ దినోత్సవాన్ని ప్రతీ ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ప్రజలు సైతం సైనికుల త్యాగాలకు గుర్తుగా క్యాండిల్స్‌ వెలిగించి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన - రాత్రికి రాజమండ్రిలోనే బస