దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 17,135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు బుధవారం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశవ్యాప్తంగా 17135 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,87,037కు చేరుకుంది.
అలాగే, ఈ వైరస్ నుంచి 4,34,04,029 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,530 మందికి దేశ వ్యాప్తంగా చనిపోయారు. మరో 1,36,478 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలావుంటే, గత 24 గంటల్లో 53 మంది చనిపోగా, 20419 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.3 శాతానికి చేరింది. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.50 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని వెల్లడించింది.