Webdunia - Bharat's app for daily news and videos

Install App

Omicron Live News: ఒమిక్రాన్ వ్యాప్తి, తాజా స్థితి ఏంటి? 16,000 మంది ప్రయాణికులు వచ్చారు...

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (18:16 IST)
భారతదేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కర్ణాటకలో ఇద్దరు వ్యక్తులకు నిర్ధారించబడ్డాయి. వారిలో ఒకరు దక్షిణాఫ్రికా జాతీయుడు, ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. ఒమిక్రాన్ ప్రమాదంలో ఉన్న దేశాల నుండి వచ్చిన 16,000 మంది ప్రయాణీకులలో 18 మందికి పాజిటివ్ అని శుక్రవారం ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు భారతదేశంలో గత 24 గంటల్లో 9,216 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 391 మరణాలు నమోదయ్యాయి.

ఒమిక్రాన్ భయం లేదు: థియేటర్లు తెరిచే వుంటాయి
క‌రోనా థార్డ్ వేవ్ వ‌చ్చేసింది. భార‌త్‌లోనే కొన్ని కేసులు వున్నాయంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం సినిమా థియేట‌ర్ల‌పై ప‌డుతుంద‌ని తెలుగు సినిమా ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇలాంటి టైంలో బాలకృష్ణ అఖండ విడుద‌లైంది. ప్రేక్ష‌కులు అనూహ్యంగా థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. అయినా ఎక్క‌డో ద‌ర్శక నిర్మాత‌ల్లో శంక నెల‌కొంది. దీనిని నివృత్తి చేసుకోవ‌డానికి ప్ర‌ముఖ ద‌ర్శక నిర్మాత‌లు రాజ‌మౌళి, దిల్‌రాజు, మైత్రీ మూవీస్ అధినేత‌లు, రాధాకృష్ణ మొద‌లైన‌వారు తెలంగాణ సినిమా టోగ్ర‌పీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌ను శుక్ర‌వారంనాడు స‌చివాల‌యంలో క‌లిశారు.
 
ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని వారికి భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని భ‌రోసా ఇచ్చారు. థియేట‌ర్లు యాభై శాతం ఆక్యుపెన్సీ వంటివేవీ త‌మ వ‌ద్ద లేవ‌ని తేల్చిచెప్పారు. ప్ర‌జ‌లు థియేటర్ వెళ్లి సినిమా చుడండి. ఏ వేరియంట్ వచ్చినా తట్టుకునేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. థియేటర్ లు మూసివేయం .. ఇబ్బందులు లేవు.  
 
- అలాగే నిర్మాతలు ఆందోళన పడాల్సిన పనిలేదు. టికెట్ రేట్లు పెంచుకోవ‌చ్చ‌నే అంశం పెండింగ్ లో ఉంది. ఏది ఏమైనా నిర్మాతలకు నష్టం లేకుండా చూస్తాం అని తెలిపారు.
 
రాజ‌మౌళి, దిల్ రాజు బృందం సినిమాలోని అనేక అంశాలను ఈ సంద‌ర్భంగా మంత్రి ముందుకు తెచ్చారు.  పెద్ద సినిమాలు రిలీజ్ కోసం వేచి ఉన్నాయి. ఇప్ప‌టికే  కోవిడ్ కారణంగా సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడింది. మరోసారి ఇంకో వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది వంటి ప‌లు విష‌యాలు విన్న మంత్రి  వారికి ధైర్యాన్ని చెబుతూనే ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

తర్వాతి కథనం
Show comments