ప్రపంచంలో పాకుతున్న కరోనా ఓమిక్రాన్, ఏయే దేశాల్లో ఏంటి పరిస్థితి?

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (20:35 IST)
కరోనా వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాల్లో క్రమంగా విస్తరిస్తోంది. దీనితో పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మన దేశం సైతం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.

 
దక్షిణ ఆఫ్రికాపై ప్రయాణ నిషేధాలను పలు దేశాలు విధించాయి. వేరియంట్‌ను దూరంగా ఉంచడానికి అత్యంత విస్తృతమైన ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్ శనివారం విదేశీయుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

 
డెన్మార్క్ ఓమిక్రాన్ వేరియంట్‌ను ఇద్దరు ప్రయాణికులలో వున్నట్లు గుర్తించింది. దేశంలో సంక్రమణ జరగకుండా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఓమిక్రాన్ లక్షణాలతో వున్న ప్రయాణికులతో పాటు దేశంలోకి వచ్చిన మిగిలినవారిని కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

 
దక్షిణాఫ్రికా విమానాల్లో వచ్చిన 600 మంది ప్రయాణీకుల్లో పెద్దసంఖ్యలో ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు డచ్ ఆరోగ్య అధికారులు తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో డచ్ హెల్త్ అథారిటీ మాట్లాడుతూ... శుక్రవారం రెండు విమానాలలో ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయానికి వచ్చిన 624 మంది ప్రయాణికులలో ఓమిక్రాన్ లక్షణాలతో వున్న ప్రయాణికులు వున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

 
బహ్రెయిన్, సౌదీ అరేబియా, సూడాన్ ఆఫ్రికన్ దేశాల నుండి విమానాలను నిషేధించాయి. ఫ్రాన్స్ దేశ ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ... ఓమిక్రాన్ వేరియంట్ బహుశా ఇప్పటికే ఫ్రాన్స్‌లో తిరుగుతోంది, దానిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేస్తోందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

Suman: రెగ్యులర్ షూటింగ్ లో ఉదయ భాస్కర వాగ్దేవి డైరెక్టన్ లో మహానాగ

రిషికేష్‌కు రజినీకాంత్, రోడ్డు పక్కన రాతి బెంచీపై ప్లేటులో భోజనం చేస్తూ...

Raviteja: రవితేజ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments