Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

జర్మనీని హడలెత్తిస్తున్న కరోనా ఒమిక్రాన్, రోజుకి 76 వేల పాజిటివ్ కేసులు, విమానాల్లో పేషంట్లు

Advertiesment
Corona Omicron
, శనివారం, 27 నవంబరు 2021 (16:45 IST)
జర్మనీలో కరోనా ఒమిక్రాన్ బెంబేలెత్తిస్తోంది. శుక్రవారం ఒక రోజు 76,000 కంటే ఎక్కువ కరోనా ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్ల కొత్త రికార్డును నివేదించింది. స్థానిక ఆసుపత్రుల్లో ఖాళీలు లేకపోవడంతో వైమానిక దళం తీవ్రంగా అనారోగ్యంతో ఉన్న రోగులను చికిత్స కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఇలాంటి చర్య ఇంతకుమున్నెన్నడూ జరగలేదు.

 
అలాగే కోవిడ్ కారణంగా జర్మనీలో ఇప్పటివరకూ లక్షకు పైగా మృత్యువాత పడ్డారు. ప్రధానంగా దేశంలోని దక్షిణ, తూర్పున ఉన్న ఆసుపత్రుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జర్మనీలోని కోవిడ్ రోగులను ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకుని వెళ్లేందుకు "ఫ్లయింగ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు" అని పిలవబడే వైమానిక దళం ఏర్పాటైంది. ఆరు ఐసియు పడకల వరకు అమర్చిన విమానాలను ఉపయోగించడం దేశంలో ఇదే మొదటిసారి.

 
కొత్త కోవిడ్ వేరియంట్‌ను గుర్తించిన తర్వాత దక్షిణాఫ్రికాను వైరస్ వేరియంట్ ప్రాంతంగా బెర్లిన్ ప్రకటిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. శుక్రవారం రాత్రి నుండి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం, ప్రకారం దక్షిణాఫ్రికా నుంచి వచ్చే జర్మన్లు, టీకాలు వేసిన వారు కూడా 14 రోజులు క్వారెంటైన్లో గడపవలసి ఉంటుంది.
 
 
వేరియంట్ - B.1.1.529 అని పిలుచుకుంటున్న ఈ కొత్త వేరియంటుకి ఒమిక్రాన్ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ రోగనిరోధక శక్తి వున్నప్పటికీ శరీరంలోకి ప్రవేశించి ఇబ్బందులకు గురిచేస్తుందని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండేళ్ళలోనే ఘోరంగా విఫలమయ్యారు.. జగన్ పాలన ఫ్లాప్ : ఉండవల్లి