ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు చాలా సమయం వుండటంతో ఆటగాళ్లంతా లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. వీరిలో రిషభ్ పంత్ యూరో 2020 కప్‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. మంగళవారం రాత్రి లండన్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ మధ్య జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్ వీక్షించడానికి వెళ్లాడు.
తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిన పంత్ మ్యాచ్ సందర్భంగా సెల్ఫీలతో సందడి చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంగ్లండ్, జర్మనీ మ్యాచ్ చూడటం మంచి అనుభూతిని కలిగించిందంటూ పంత్ ట్వీట్ చేశాడు.
అయితే అభిమానులు మాత్రం పంత్ ట్వీట్‌పై భిన్నంగా స్పందించారు. ఏ టీమ్‌కు సపోర్ట్ చేశావని ఒకరు.. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని మరొకరు కామెంట్ చేశారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 2-0తో జర్మనీని ఓడించింది.
ఇక కివీస్‌తో జరిగిన ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో రిషబ్ పంత్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసినా చివరి వరకు నిలబడకపోవడంతో టీమిండియా తక్కువ స్కోరుకే ఆలౌటై కివీస్ చేతిలో పరాజయం పాలైంది. తద్వారా డబ్ల్యూటీసీ తొలి టైటిల్‌ను కివీస్ గెలుచుకుంది. ఇక ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది.