బ్రెజిల్‌లో విషాదం నెలకొంది. టొక్టానిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు మరణించారు. జట్టు అధ్యక్షుడితో పాటు పైలట్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణాది రాష్ట్రమైన టొకాన్టిన్లో ఈ ఘటన జరిగిందని టీం యాజమాన్యం వెల్లడించింది. విమానంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని తెలిపింది.
టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా నేలమీద పడిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. విలానోవా జట్టుతో గేమ్ ఆడేందుకు ఆటగాళ్లంతా జోయియానియాకు వెళ్తున్నారు. మృతులను లుకాస్ మెయిరా, లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారిగా గుర్తించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విమానం ఎలాంటిదన్న విషయంపై జట్టు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. పుట్ బాల్ ఆటగాళ్లంతా విమాన ప్రమాదంలో చనిపోవడంతో పామాస్ ఫుట్ బాల్ క్లబ్ లో విషాదం నెలకొంది. ఈ విమాన ప్రమాదంపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు.