గ్లామర్‌ను చూపించినా అదంటే భయంటున్న కిమ్ కర్ధాషియన్
, శనివారం, 19 జూన్ 2021 (13:38 IST)
అమెరికన్ టాప్ మోడల్, రీయాలిటి టీవీ స్టార్ కిమ్ కర్ధాషియన్ తన హాట్ ఫిగర్‌తో ఎప్పటికప్పుడు కుర్రకారును అకట్టుకుంటోంది. అందులో భాగంగా ఈ భామ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాజాగా బికినీతో టెన్నీస్ ఆడుతున్న ఫొటోలు పోస్ట్ చేసింది. ఆ ఫొటోలకు సోషల్మీడియాలో అభిమానులు `వావ్` అంటూ మెచ్చుకోలుగా స్పందించారు. ఇక ఆమె సన్నిహితురాలు డాన్సర్ అయిన షెపర్డ్ కూడా బాగా రియాక్ట్ అయింది. మనిద్దరం ఒక్కటే. బికినీలతో ఫొటోలు బాగానే వున్నాయి. మన ఫొటోగ్రాహర్ అద్శుతంగా తీశాడంటూ ఆమె తన ఫొటోను కూడా పోస్ట్ చేస్తూ, మరి తర్వాత ఎక్కడ? అంటూ ప్రశ్నించింది.
ఇదిలా వుండగా, కిమ్ వివాహం చేసుకునే టైంలో ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. కిమ్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్ హంఫ్రీస్‌తో తన వివాహం గురించి ఓ ఇంటర్వ్యూ వివరాలు తెలిపింది. ఆగస్టు 2011 లో జరిగిన వివాహానికి ఒక రోజు ముందే ఆమె పారిపోయింది. ఎందుకని ప్రశ్నించగా. అప్పటికే తనకు వణుకు పుట్టిందనీ, తెలీని భయం వేసిందని 40 ఏళ్ల భామ వెల్లడించింది. తాను ఒత్తిడికి గురయ్యానని అందుకే బయటపడాలని నిర్ణయించుకున్నానంటూ బదులిచ్చింది. ఇక ఆమె అసిస్టెంట్, .సన్నిహితురాలు అయిన షెపర్డ్ కూడా రెండేళ్ళకొకసారి బాయ్‌ఫ్రెండ్‌ను మారుస్తుందని హాలీవుడ్‌లో కథనాలు వచ్చాయి. మరి కిమ్ కూడా అదే బాటలో నడుస్తుందే ఏమో చూడాలి.
తర్వాతి కథనం