రెబల్‌స్టార్ ప్రభాస్ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడని గత కొద్దిరోజులు వార్త చక్కర్లు కొడుతుంది. దేశరాజధాని మీడియా కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మిషన్ ఇంపాజిబుల్ 7`లో ప్రభాస్ ఓ పాత్ర పోషిస్తున్నట్లు అనుమానస్పదంగా వార్తలు రాసింది. దానికితోడు భారత వార్తా ఛానెళ్లలో వైరల్ న్యూస్ ట్రెండింగ్ ఉంది, అయితే వీటిపై నెటిజర్లు తగిన విధంగా తమ స్పందనలను తెలియజేశారు. ప్రభాస్ ఆహార్యం అందుకు తగినవిధంగా వుంటుందనీ, బాహుబలి తర్వాత ఆయన రేంజ్ ఆ స్థాయిలో వుండడం ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు.
కాగా, రెండు రోజులు మరలా ఆంగ్ల మీడియా చేస్తున్న కథనాలకు నెటిజన్లు నేరుగా మిషన్ ఇంపాజిబుల్ 7 దర్శకుడు క్రిస్టోఫర్ మెక్వారీకి మెయిల్ చేశారు. అందుకు ఆయన నిన్ననే స్పందించారు. క్రిస్టోఫర్ ఆ వార్తను తోసిపుచ్చాడు, "అతను (ప్రభాస్) చాలా ప్రతిభావంతుడైన వ్యక్తి అయితే, మేము ఎప్పుడూ ఆయన్ను కలవలేదు` అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ హాలీవుడ్ సినిమా చేయడంలేదని, అదంతా కల్పిక వార్తనేనని తేలిసంది.
ఇక క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ఒక అమెరికన్ స్క్రీన్ రైటర్, ఫిల్మ్ డైరెక్టర్, నిర్మాత. అతను నియో-నోయిర్ మిస్టరీ చిత్రం ది విజువల్ సస్పెక్ట్స్ కొరకు బాఫ్టా అవార్డు, ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కొరకు అకాడమీ అవార్డును అందుకున్నాడు.