మోహన్‌లాల్ కు అపురూపదృశ్యాలతో శుభాకాంక్షలు తెలిపిన స్టార్స్
, శుక్రవారం, 21 మే 2021 (18:55 IST)
Lal-rajani-balayaa,viajayasanthi
మోహన్‌లాల్ పుట్టినరోజైన ఈ శుక్రవారంనాడు సినీ ప్రముఖులు అప్పటి జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ముఖ్యంగా 1993లో నిప్పురవ్వ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో దిగిన ఫొటో అలరిస్తోంది. అప్పుడు అందరినీ పూలమాలతో తస్కరించిన దృశ్యం అది. బాలయ్య ఫ్యాన్స్ తన సోషల్‌మీడియా దీన్నిపెట్టారు. ఈ చిత్రం బాలయ్య, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించి చివరి చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని సాధించలేదు.
అదేవిధంగా బాలకృష్ణ తన సోషల్ మీడియాలో ఆయనతో కూర్చుని మంతనాలు జరుపుతున్న ఫొటోను పెట్టి సంతోషం వ్యక్తం చేశారు. స్టార్ ఆఫ్ మాలీవుడ్ ఇండస్ట్రీఅని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి అయితే, సినిమాటిక్ టాలెంట్‌లో పవర్ హౌస్‌లాల్‌జీ అంటూ సంబోధించారు. గొప్ప మానవతావాధి, లవ్ లీ బ్రదర్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ మీ నవ్వు ఇలానే వుండాలంటూ పేర్కొన్నారు.
ఇక రెబల్ స్టార్ ప్రభాస్‌కూడా ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. సర్ స్మైలింగ్ ముఖం మీది. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలి అంటూ ట్వీట్ చేశాడు.
మరోవైపు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్., మోహన్‌లాల్ కాంబినేషన్‌లో జనతా గేరేజీ సినిమా వచ్చింది. షూటింగ్‌లోని ఆయనతో వున్న క్షణాల్ని ఒక్కసారి గుర్తుచేసుకున్నారు. ఎంతో మేథావి సార్.. మీతో గడిపిన క్షణాలు ఎంతో నేర్చుకునేలా చేశాయి. ఆరోగ్యంగా వుండాలని పోస్ట్ చేశాడు.
ఇక సంజనా గల్రాని నటి కూడా మోహన్‌లాల్‌తోపాటు చిరంజీవితో కలిసిన ఫొటో షేర్ చేసింది. మోహన్‌లాల్‌తో ఏదో సిప్ చేస్తూ ఆయన ఒడిలో కూర్చుని వున్న ఫొటో పెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
తర్వాతి కథనం