Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఉద్యోగులకు ఉపశమనం: దేశంలోనే మొదటిసారిగా డబ్ల్యూఎఫ్ హెచ్‌టీ సెంటర్లు

Advertiesment
software companies
, మంగళవారం, 16 నవంబరు 2021 (22:02 IST)
వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్ల వెబ్‌సైట్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారికంగా లాంచ్ చేశారు. ఇంత త్వరగా పైలట్ ప్రాజెక్టును పట్టాలెక్కించిన ఐటీ శాఖ, ఏపీఎస్ఎస్డీసీ, ఏపీఎన్ఆర్టీ, ఏపీఐఎస్, ఏపీఎస్సీహెచ్ఈ విభాగాల టీమ్ వర్క్‌ను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.


సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఉద్యోగులకు ఎంతగానో ఉపశమనం కలగించే డబ్ల్యూఎఫ్ హెచ్‌టీ అధికారిక వెబ్‌సైట్‌ను విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ పరిస్థితులలో  స్వగ్రామాలకు చేరిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటర్నెట్ అంతరాయం, కొన్ని చోట్ల ఆఫీస్ వాతావరణం లేక ఇబ్బందిపడ్డారని..అలాంటివారికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.


ఎన్నో కంపెనీలు ఉద్యోగుల ఖర్చుతగ్గించుకునే ప్రయత్నంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గుచూపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మారుమూల ప్రాంతాలలోనూ ఈ వ్యవస్థను తీసుకువచ్చేందుకు ఈ పైలట్ ప్రాజెక్ట్ కు స్పందనతో అంచనా వేసుకుంటామన్నారు. ప్రస్తుతానికి విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్దనగరాలలో ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.5 వేలు మాత్రమే ఖర్చవుతుందన్నారు.


ఏపీలోని మిగతా పట్టణాల్లో కేవలం రూ.4వేలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఈ అమౌంట్ కొన్ని కార్పొరేట్ సంస్థలు వసూలు చేసే మొత్తంలో 25 శాతం మాత్రమేనన్నారు.  ల్యాప్ టాప్ తెచ్చుకుని హాయిగా పని చేసుకునే వీలుగా ప్రతి డబ్ల్యూఎఫ్ హెచ్‌టీలో సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 చోట్ల ఇంజనీరింగ్ కాలేజీలు, విశాఖ, కాకినాడ, తిరుపతి ప్రాంతాలలో ఏపీఎస్ సెంటర్లలో 30 మంది కూర్చుని పని చేసుకునే వీలుగా ఈ వర్క్ ప్రమ్ హెమ్ టౌన్లను తీర్చిదిద్దామని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.


కంపెనీలు, ఉద్యోగుల నుంచి వచ్చే డిమాండ్‌ని బట్టి త్వరలో ఈ సెంటర్లను మరిన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని మంత్రి తెలిపారు భవిష్యత్ లో లక్ష మంది ఉద్యోగులు లక్షణంగా పని చేసుకునే వీలుగా 102 సీఎం ఎక్సలెన్స్ సెంటర్లు, 500 కళాశాలలు, 20 ఇంజనీరింగ్ కాలేజీలు సహా ఏపీఐఎస్, ఏపీఐఐసీ కేంద్రాలను వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ కేంద్రాలుగా మార్చనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లను వినియోగించుకోవడానికి ఆసక్తి కలిగిన ఐటీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు 99888 53335 నంబర్‌కి సంప్రదించవచ్చు. లేదా apit.ap.gov.in/wfht/ వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఐ.టీ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఐ.టీ శాఖ సలహాదారులు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, శేషి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాయల్... ఆకాశంలో హనీమూన్.. రూ.75వేలు చెల్లిస్తే... 45 నిమిషాల పాటు..