హనీమూన్‌ను మధురానుభూతిగా నిలుపుకోవాలనుకునే వారి కోసం లవ్ క్లౌడ్ జెట్ చార్టర్ అనే సంస్థ ఈ ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నూతన జంటలు తమ హనీమూన్‌ను విమానాల్లో జరుపుకునేలా ప్లాన్ వేశారు. ఇందుకోసం జంటలను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్లాన్స్ కూడా అనౌన్స్ చేశారు.
హనీమూన్ కోసం ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకోవడానికి కేవలం 995 అమెరికన్ డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. అంటే భారతీయ కరెన్సీలో 73 వేల రూపాయలు అన్నమాట. అయితే, ఈ మొత్తం చెల్లిస్తే 45 నిమిషాల ప్రయాణానికి మాత్రం అవకాశం ఉంటుంది. అంతకు మించి సమయం కావాలనుకుంటే.. మరింత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, ఈ విమానంలో ప్రత్యేకంగా రాయల్ హనీమూన్‌కు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. రూ. 75 వేలు చెల్లిస్తే దాదాపు 45 నిమిషాల పాటు విమానం గాలిలోనే ఉంటుంది. ఇంకా సమయం కావాలనుకుంటే.. అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీస్‌లు, సదుపాయాలను చూసి మీ హనీమూన్‌ను ప్రత్యేకంగా మార్చుకోవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హనీమూన్ కోసం విమానంలో ప్రత్యేకంగా క్వీన్ బెడ్ ఏర్పాటు చేశారు. ఈ విమానానికి ఒకే ఒక పైలట్ ఉంటాడు. అలాగే.. పైలట్ కాక్‌పిట్ కి, విమానం ఇతర భాగానికి ఎలాంటి లింక్ ఉండదు.
సో.. జంట గోప్యతకు కూడా సమస్య ఉండదు. గత ఏడు సంవత్సరాలుగా లవ్ క్లౌడ్ కంపనీ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక సేవలను అందిస్తూ వస్తోంది. రిమాంటిక్ డిన్నర్, విమానంలో పెళ్లి ఫెసిలిటీ కూడా తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విమానంలో హనీమూన్‌కు శ్రీకారం చుట్టింది.