Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాఠశాల విద్యార్థులకు 30,107 జతల షూస్‌ను విరాళంగా అందించిన రియల్‌ పేజ్‌ ఇండియా

Advertiesment
పాఠశాల విద్యార్థులకు 30,107 జతల షూస్‌ను విరాళంగా అందించిన రియల్‌ పేజ్‌ ఇండియా
, సోమవారం, 15 నవంబరు 2021 (13:44 IST)
రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ కోసం సాఫ్ట్‌వేర్‌, డాటా ఎనలిటిక్స్‌ అందించడంలో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థ రియల్‌ పేజ్‌ నేడు బాలల దినోత్సవం పురస్కరించుకుని తమ నూతన సోషల్‌ ఇంపాక్ట్‌ కార్యక్రమం ‘రియల్‌ సోల్స్‌ ఫ్రమ్‌ రియల్‌ సౌల్స్‌’ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం నూతన గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌‌ను సైతం సృష్టించింది.
 
60 వేల షూస్‌తో వరుస ఏర్పాటుచేయడంతో పాటుగా ఈ 30,107 జతల షూస్‌ను తెలంగాణా ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల విద్యార్థులకు అందజేశారు. తద్వారా 30,107 మంది పాఠశాల విద్యార్థుల జీవితాలనూ స్పృశించారు.
 
 గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ షూస్‌ను హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతాలలోని 100కు పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు.
 
ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, ఛైర్మన్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణా పాల్గొన్నారు. 
 
‘‘రియల్‌ పేజ్‌ వద్ద, వినూత్నమైన కార్యక్రమాలైనటువంటి ‘రియల్‌ సోల్స్‌ ఫ్రమ్‌ రియల్‌ సౌల్స్‌’ వంటివి బాధ్యతాయుతమైన కార్పోరేట్‌ పౌరునిగా నిలువాలనే మా సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ మహోన్నతమైన కారణంలో నేను కూడా కూడా భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఈ అసాధారణ ఫీట్‌ సాధించిన రియల్‌ పేజ్‌ ఇండియా టీమ్‌ను అభినందిస్తున్నాను’’ అని డానా జోన్స్‌, సీఈఓ, రియల్‌ పేజ్‌ అన్నారు.
 
 
 
సందీప్‌ శర్మ, ఎస్‌వీపీ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, రియల్‌ పేజ్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘ ఇది కేవలం రికార్డు సృష్టించడం వరకూ మాత్రమే కాదు, అంతకుమించి! ఈ  రికార్డు ప్రయత్నానికి ఆవల, ఈ కార్యక్రమంలో భాగంగా తమ నూతన జత షూస్‌ను అందుకున్న ప్రతి నిరుపేద చిన్నారి మోములోనూ చిరునవ్వు చూడాలని ప్రతి రియల్‌ పేజర్‌ కోరుకున్నాడు.  నేడు అది సాధ్యమైంది. ఈ గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌, 2021 సంవత్సరాన్ని మరింత అద్భుతంగా మలిచింది మరియు మా లబ్ధిదారులకు అంతా శుభం జరుగాలని రియల్‌ పేజ్‌ ఇండియా ఆకాంక్షిస్తుంది’’ అని అన్నారు.
 
 
 
‘‘సామాజిక  కారణాల కోసం మన కార్పోరేట్స్‌ ముందుకు రావడంతో పాటుగా  అసలైన ప్రభావాన్ని చూపుతుండటం నాకు పూర్తి సంతృప్తినిస్తుంది. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం 30వేల జతల షూస్‌ను విరాళంగా అందించడంతో పాటుగా ఈ ప్రయత్నంలో భాగంగా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌ను సాధించిన రియల్‌ పేజ్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌, ఉద్యోగులను నేను అభినందిస్తున్నాను’’ అని తెలంగాణా రాష్ట్ర  పురపాలక వ్యవహారాలు, నగరాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖామాత్యులు కె టి రామారావు అన్నారు.
 
 
 
‘‘రియల్‌ పేజ్‌ ఇండియా ప్రారంభించిన ‘రియల్‌ సోల్స్‌ ఫ్రమ్‌ రియల్స్‌ సౌల్స్‌’ కార్యక్రమం అపూర్వమైన ప్రయత్నం. దీనిలో భాగంగా నిరుపేద పాఠశాల విద్యార్థులకు 30,107 జతల షూస్‌ బహుమతి అందించారు. ఈ వినూత్నమైన ఆలోచన చేయడంతో పాటుగా అద్భుతంగా అమలు చేసి, గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తింపును పొందిన రియల్‌ పేజ్‌ బృందాన్ని నేను అభినందిస్తున్నాను’’ అని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఐఏఎస్‌ అన్నారు.
 
 
 
స్వప్నిల్‌ దంగారికర్‌, అధికారిక న్యాయనిర్ణేత, గిన్నీస్‌ మాట్లాడుతూ, ‘‘ షూస్‌తో అతిపెద్ద వరుస సృష్టించే ప్రయత్నం చివరగా 2011లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో జరిగింది. అప్పట్లో 24,962 షూస్‌ను అమర్చారు. అప్పటి నుంచి వేరెవరూ ఈ రికార్డు బద్దలు కొట్టడానికి ప్రయత్నించలేదు. రియల్‌పేజ్‌ నేడు ఈ రికార్డును 30,107 జతల షూస్‌ను 6.188 కిలోమీటర్ల దూరం పేర్చి అధిగమించింది. ఈ రికార్డును ప్రత్యక్షంగా తిలకించడం కోసం నేను ఇక్కడకు ప్రత్యేకంగా రావడంతో పాటుగా మొత్తం లైన్‌ను పరిశీలించాను. వారు ఈ షూస్ అమర్చిన విధానం చూసిన తరువాత రియల్ పేజ్ అద్భుతం అని చెప్పగలను''’’ అని అన్నారు.
 
 
 
ఈ కార్యక్రమంలో ‘రియల్‌ పేజ్‌ రియల్‌ హీరోస్‌’ అవార్డు విజేతలను కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి తిరిగివ్వాల్సిన ఆవశ్యకతను వెల్లడించడంతో పాటుగా అత్యుత్తమ సమాజం, పర్యావరణ  రూపకల్పనలో  తోడ్పాటునందిస్తున్న సంస్థలు మరియు వ్యక్తులను గౌరవించారు. 
 
రియల్‌ పేజ్‌ వాగ్ధానం ద్వారా పలు సామాజిక కారణాల కోసం రియల్‌ పేజ్‌ కట్టుబడి ఉంది. ఇది కంపెనీ యొక్క విలువలను వెల్లడించడంతో పాటుగా, ప్రపంచవ్యాప్తంగా తాము  నివశిస్తున్న, పనిచేస్తున్న ప్రాంతాలలోని  సమాజాలకు రియల్‌ పేజర్లు తిరిగివ్వడాన్ని ప్రోత్సహిస్తుంది. రియల్‌ పేజ్‌ ప్రామిస్‌ సంస్కృతి, కొలవతగినవి, స్థిరమైనవి మరియు వ్యాప్తి చేయతగినవైన పలు సామాజిక ప్రభావ కార్యక్రమాలకు స్ఫూర్తి కలిగించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదో రియల్ ఎస్టేట్ యాత్ర, భ్రమరావతి యాత్ర!