Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాయాదుల సమరం... రికార్డ్ బద్ధలు.. ఆ మ్యాచ్‌ను బీట్ చేసింది...

దాయాదుల సమరం... రికార్డ్ బద్ధలు.. ఆ మ్యాచ్‌ను బీట్ చేసింది...
, శుక్రవారం, 26 నవంబరు 2021 (10:31 IST)
ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా దాయాదుల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ సమరం రికార్డు సాధించింది. భారత్‌లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. దేశంలో స్టార్ ఇండియా నెట్‌వర్కులో ఏకంగా 15.9 బిలియన్ నిమిషాలపాటు ఈ మ్యాచ్‌ను వీక్షించినట్టు ఐసీసీ తాజాగా వెల్లడించింది. 
 
ప్రపంచవ్యాప్తంగా 10 వేల గంటలు లైవ్ కవరేజీ చేసినట్టు తెలిపింది. 2016 టీ20  ప్రపంచకప్‌లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీస్‌ను అత్యధికమంది వీక్షించగా ఇప్పుడా రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌ను 60 శాతం ఎక్కువ మంది వీక్షించారు.  ఐసీసీ సామాజిక మాధ్యమాల ద్వారానూ అత్యధికమంది తిలకించారు. 618 మిలియన్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించినట్టు ఐసీసీ వివరించింది.
 
పాకిస్థాన్‌లో పీటీవీ, ఏఆర్‌వై, టెన్‌స్పోర్ట్స్‌లు ప్రసారం చేయగా 7.3 శాతం మంది అధికంగా వీక్షించారు. ఆస్ట్రేలియాలో అయితే ఫాక్స్ నెట్‌వర్క్‌లో ఏకంగా 175 శాతం అధిక వీక్షణలు లభించినట్టు ఐసీసీ వివరించింది. 
 
అమెరికాలోనూ ఈ మ్యాచ్‌కు విశేష ఆదరణ లభించింది. ఈఎస్‌పీఎన్‌లో ప్రసారమైన భారత్-పాక్ మ్యాచ్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా చూశారు. ఫేస్‌బుక్‌లోనూ ఈ లీగ్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో 3.6 బిలియన్ వ్యూస్ లభించగా, ఈ మ్యాచ్‌ ఆ రికార్డును బద్దలు చేస్తూ 4.3  బిలియన్ వ్యూస్ దక్కించుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ : టీమిండియా బ్యాటింగ్