భారత్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు గురువారం నుంచి టీమిండియాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రహానే ఏమాత్రం ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ స్టేడియంలో జరుగుతోంది.
ఇప్పటికే కివీస్ జట్టుతో జరిగిన మూడు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అలాగే, టెస్ట్ సిరీస్‌ను గెలిచి సత్తాచాటాలన్న పట్టుదలతో భారత ఆటగాళ్లు ఉన్నారు. పైగా, ఇపుడు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో జరుగుతున్న తొలి టెస్ట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
భారత్ : రహాన్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, పుజారా, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహూ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, ఆర్.అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), లాథమ్, టేలర్, నికోలస్, బ్లెండెల్, (కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జెమీసన్, సోమర్ విల్లే.