Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయిలాండ్‌లో కోతుల పండుగ - టన్నుల కొద్దీ పండ్లు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (18:46 IST)
సాధారణంగా జనావాస ప్రాంతాల్లోకి వచ్చే కోతులను కర్రలతో తరుముతుంటాం. కానీ, అక్కడ మాత్రం ఆ కోతులతో ఒక పెద్ద పండుగను నిర్వహిస్తారు. ఈ కోతులన్నీ ఒక చోట చేరిన ప్రాంతంలో మంకీ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. థాయిలాండ్‌లోని లోప్‌బురి అనే ప్రాంతంలో ఈ మంకీ ఫెస్టివల్‌ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
 
నిజానికి గత రెండు సంవత్సరాలుగా ఈ కోతుల పండుగ నిర్వహించలేదు. కానీ, ఇపుడు కరోనా వ్యాప్తి చాలా మేరకు సద్దుమణగడంతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మంకీ ఫెస్టివల్‌లో భాగంగా, కోతుల కోసం రెండు టన్నుల వివిధ రకాలైన పండ్లు, కూరగాయలను పండుగ జరిగే ప్రాంతానికి తరలిస్తారు. 
 
ఈ ప్రాంతానికి వివిధ జాతులకు చెందిన కోతులు వచ్చి పుష్టిగా ఆరగించి వెళతాయి. ఈ పండుగను తిలకించేందుకు వచ్చే పర్యాటకుల భుజాలపైకి ఎక్కి, వారు పెట్టే ఆహారాన్ని ఆరగిస్తూ సరదాగా గడుపుతాయి. ఈ ప్రాంతంలో ఉండే స్థానికులు దీన్ని ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ కోతుల ఫెస్టివల్ ద్వారా వచ్చే నిధులతో ఈ యేడాది 100 మందికి వీల్ చైర్లను ఉచితంగా అందించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments