Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కేసులకు మూలం మర్కజ్... 2027కి పెరిగిన సంఖ్య

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (08:42 IST)
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమ్మేళనం దెబ్బకు దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దేశంలోని పలు ప్రాంతాలకు కరోనా వ్యాపించడానికి ప్రధాన కారణం ఈ మర్కజ్ సమ్మేళనమేనని తేలిపోయింది. దీంతో ఆపరేషన్ నిజాముద్దీన్ పేరుతో కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. మర్కజ్ భవన్‌లో ఉన్న విదేశీ, స్వదేశీ ముస్లిం మతపెద్దలందరినీ క్వారంటైన్లకు తరలించారు. పైగా, ఢిల్లీ నిజాముద్దీన్ నుంచే దేశంలోని పలు ప్రాంతాలకు కరోనా వ్యాప్తి పెరిగింది. 
 
బుధవారం ఆయా రాష్ట్రాల్లో కొత్తగా వెలుగు చూసిన పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారుగా తేలింది. ఇప్పటివరకు 6000 మందిని గుర్తించారు. మరో 2 వేల మంది కోసం గాలిస్తున్నారు. భారత్‌లో శుక్రవారం ఉదయం వరకు 2027 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 169 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
 
ఈ కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 335, కేరళలో 265 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో 234, ఢిల్లీలో 152, రాజస్థాన్‌లో 120, ఉత్తరప్రదేశ్‌లో 177, ఆంధ్రప్రదేశ్‌లో 111, కర్ణాటకలో 110, తెలంగాణలో 97, గుజరాత్‌లో 87, మధ్యప్రదేశ్‌లో 86, జమ్మూకాశ్మీర్‌లో 62, పంజాబ్‌లో 46, హర్యానాలో 43, పశ్చిమ బెంగాల్‌లో 37, బీహార్‌లో 24, చండీఘర్‌లో 17 కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, అసోంలో 13, లడఖ్‌లో 13, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 10, ఛత్తీస్‌గఢ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 7, గోవాలో 5, ఒడిశాలో 5, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, పుదుచ్చేరిలో 3, జార్ఖండ్‌, మణిపూర్‌, మిజోరంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి. హర్యానా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments