Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్‌లో ఏముంది? అది ఎందుకంత ప్రమాదకరం?

కరోనావైరస్‌లో ఏముంది? అది ఎందుకంత ప్రమాదకరం?
, బుధవారం, 1 ఏప్రియల్ 2020 (21:15 IST)
కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. కరోనావైరస్ గురించి, దానికి దూరంగా ఉండే చిట్కాల గురించి ఇందులో వివరించింది. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఇందులో చెప్పింది.

 
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ చేసిన తాజా పరిశోధన ప్రకారం కోవిడ్-19 లక్షణాలు, ఫ్లూ (ఇన్‌ఫ్లూయెంజా) లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ, ఈ రెండింటినీ శరీర రోగ నిరోధక వ్యవస్థ ఒకేలా ఎదుర్కోలేదు. కరోనావైరస్ వ్యాప్తి డిసెంబర్‌లో మొదలైంది. సాధారణంగా ఫ్లూ వ్యాప్తి చెందే సమయం కూడా ఇదే.

 
ఫ్లూ దాదాపుగా ప్రతి ఏటా శీతాకాలంలో వ్యాపిస్తూ ఉంటుంది. చాలా మంది జనాల్లో దీనిపై ఎంతో కొంత నిరోధకత పెరిగింది.

 
కానీ, కోవిడ్ 19 విషయంలో ఆ పరిస్థితి లేదు. కరోనావైరస్ కొత్త వైరస్. దీన్ని ఎదుర్కొనేందుకు మన రోగ నిరోధక వ్యవస్థ ఇంకా సిద్ధంగా లేదు. అందుకే ఆ వైరస్ అంత ప్రమాదకారిగా మారింది. దాని వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోంది.

 
ఇన్‌ఫ్లూయెంజా జన్యుపరంగా తన లక్షణాలను మార్చుకుంటూ ఉంటుంది. సాంకేతిక భాషలో చెప్పాలంటే పరివర్తనం (మ్యుటేట్) చెందుతుంది. కరోనావైరస్ పరివర్తనం చెందుతున్నట్లు ఇప్పటివరకైతే ఆనవాళ్లు కనిపించలేదని దాని జన్యు క్రమంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు అంటున్నారు.

 
వైరస్ ఎంత త్వరగా పరివర్తనం చెందితే, అంత ప్రమాదకరంగా మారుతుంది. వైరస్‌కు వ్యాక్సిన్ కోసమూ జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు కృషి చేస్తున్నారు. అయితే, ఈ పని పూర్తి చేసేందుకు ఏడాదిన్నర సమయం పట్టవచ్చని వాళ్లు అంటున్నారు. కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను రూపొందించడమే ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాలు.

 
వైరస్ జన్యుపరివర్తనం చెందినా, సమస్య రాకుండా వైరస్‌లోని ముఖ్యమైన ప్రోటీన్‌లను లక్ష్యంగా చేసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. మిగతా అన్ని వైరస్‌ల్లాగే కరోనావైరస్ కూడా జీవం లేని పదార్థం. ఇందులో ఓ ప్రోటీన్ అణువు (ఆర్ఎన్ఏ) ఉంటుంది. ఈ వైరస్ పరిమాణం కనురెప్ప వెంట్రుక మందంలో వెయ్యో వంతు ఉంటుంది.

 
కళ్లు, ముక్కు, నోటి ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. పేరుకుపోయిన చోట కణాల జన్యుక్రమాన్ని మార్చి, వాటిని ప్రమాదకర కణాలు మార్చుతుంది. ఈ కణాలు అలాంటి కణాలను ఇంకా పుట్టిస్తాయి. శరీరం లోపలికి వెళ్లాక, ఈ వైరస్ మనుషుల్లో శ్వాసపరమైన సమస్యలను సృష్టిస్తుంది. మొదట గొంతు వద్ద ఉండే కణాలపై దాడి చేస్తుంది. ఆ తర్వాత శ్వాస నాళం, ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. కరోనావైరస్ కర్మాగారాలుగా వీటిని మార్చుకుని, సంఖ్యను అంతకుఅంతకూ పెంచుకుంటుంది.

 
ఆరంభ దశల్లో బాధితుల్లో కొందరిలో అనారోగ్య లక్షణాలేమీ కనిపించవు. కొందరిలో కనిపిస్తుంటాయి. కోవిడ్ 19 బయటపడటానికి 14 రోజుల దాకా సమయం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కొక్కరికీ ఇది ఒక్కోలా ఉంటుంది. సగటున ఈ వ్యాధి బయటపడేందుకు ఐదు రోజులు పడుతుంది.

 
వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు ఇలా..
కోవిడ్-19 నయమైనవారిని ఉపయోగించుకుని కరోనావైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. బ్యాక్టీరియా, వైరస్‌లపై పోరాడేందుకు శరీర రోగ నిరోధక వ్యవస్థ ప్రతిరక్షకాల (యాంటీబాడీస్)ను తయారుచేసుకుంటుంది. వ్యాక్సిన్ తయారీలో ఇవి ఉపయోగపడతాయి.

 
ఒకసారి కరోనావైరస్ ఇన్ఫెక్షన్ నయమైతే ఆ వ్యక్తి శరీరంలో దాన్ని ఎదుర్కొనే ప్రతిరక్షకాలు తయారై ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. దీన్ని‘పాసివ్ ఇమ్యూనిటీ’ అంటారు. ఇన్ఫెక్షన్ నయమైన వ్యక్తుల రక్తంలోని ప్లాస్మా ద్వారా దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవచ్చు. మిగతావారిలో ఆ రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు. పోలియో లాంటి వ్యాధులకు గతంలో ఇలాగే వ్యాక్సిన్లు రూపొందించారు.

 
ఉత్తమ విధానం
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లక్షణాలున్నవారిని విడిగా ఒంటరిగా (ఐసోలేషన్‌లో) ఉంచడమే ఉత్తమమైన విధానమని జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వంటి లక్షణాలు ఉన్నవాళ్లు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు. ఆ లక్షణాలు ఒకవేళ తగ్గిపోయినా, ఏడు రోజుల దాకా విడిగానే ఉండాలి.

 
వారికి సాయపడేవాళ్లు కూడా వారి నుంచి కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి. వారిని తాకకూడదు. తరచూ చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్నవాళ్లు, వాళ్లకు సాయం చేస్తున్నవాళ్లు మాస్క్‌లు ధరించాలి. రోగుల లాలాజలం తుంపర బల్లలు, కుర్చీలు, పాత్రల వంటి వస్తువులపై పడే అవకాశం ఉంటుంది. వాళ్లు తాకిన వాటిని శుభ్రం చేయాలి. గ్లోవ్స్ ధరించాలి. దుస్తులను వేడి నీళ్లలో నానబెట్టి ఉతకాలి.

 
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందుబాబులను 'ఏప్రిల్ ఫూల్స్' చేసిన వైన్ షాపు