వంటింటి గట్టుపై గుడ్డు పగిలి దుర్వాసన వస్తుందా... ఆ ప్రాంతంలో ఉప్పును చల్లుకుంటే?

ఉప్పు లేకుండా ఏ పదార్థం పూర్తికాదు. అన్నీ సరిపోయినా ఉప్పు లేకపోతే రుచే ఉండదు. ఈ ఉప్పు కేవలం వంటలకే కాకుండా మరెన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం.

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (15:06 IST)
ఉప్పు లేకుండా ఏ పదార్థం పూర్తికాదు. అన్నీ సరిపోయినా ఉప్పు లేకపోతే రుచే ఉండదు. ఈ ఉప్పు కేవలం వంటలకే కాకుండా మరెన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం. 
 
చెక్కతో చేసిన కుర్చీలు, సోఫాలు కొన్ని పాతవాటిలా ఉంటాయి. గోరువెచ్చని నీటిలో ఉప్పును కలుపుకుని ఆ నీటిలో వస్త్రాన్ని ముంచి కుర్చీలను తుడుచుకోవాలి. కాసేపు ఎండలో ఉంచితే కొత్తగా కనిపిస్తాయి. ఒక్కోసారి బూట్ల నుండి దుర్వాసన వస్తుంది. అటువంటి సమయంలో వాటిపై కొద్దిగా ఉప్పును చల్లితే ఆ వాసన పోతుంది. 
 
ఇత్తడి, రాగి పాత్రలు కొన్ని రోజులకు రంగు మారుతాయి. వీటిని తిరిగి కొత్తవిగా చేయాలంటే కొద్దిగా బియ్యప్పిండిలో వెనిగర్, ఉప్పును కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో రాగి, ఇత్తడి పాత్రలను తోముకుంటే కొత్తవిగా మారుతాయి. ఇంట్లో చీమల బెడద అధికంగా ఉంటే ఆ ప్రాంతంలో కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి. ఇలా చేయడం వలన చీమలు ఆ ప్రాంతాలలో దరిచేరవు.
 
వంటింటి గట్టుపై గుడ్డు పగిలి దుర్వాసన వస్తే అక్కడ కొద్దిగా ఉప్పు చల్లి కాసేపటి తరువాత శుభ్రం చేస్తే దుర్వాసన సులువుగా వదిలిపోతుంది. ఉప్పునీటిలో ముంచిన వస్త్రంలో కిటికీ అద్దాలను తుడుచుకుంటే కొత్తగా కనిపిస్తాయి. కార్పెట్‌పై మరకలు పోవాలంటే చల్లని నీటిలో ఉప్పును కలుపుకుని ఆ నీటిలో వస్త్రాన్ని ముంచి తుడుచుకుంటే మరకలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments