ఇంట్లో బొద్దింకలతో బాధపడుతున్నారా? ఆ ప్రాంతాలలో ఉల్లిపాయలు పెట్టుకుంటే?
అగరువత్తులు నుసితో ఇత్తడి పాత్రలు కడిగితే పాత్రలు శుభ్రంగా ఉంటాయి. అంతేకాకుండా తళతళ మెరుస్తాయి. పెరుగులో కొబ్బరి ముక్కను వేసుకుంటే పెరుగు చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. వంటి గదిని శుభ్రం చేసుకునేటప్ప
అగరువత్తులు నుసితో ఇత్తడి పాత్రలు కడిగితే పాత్రలు శుభ్రంగా ఉంటాయి. అంతేకాకుండా తళతళ మెరుస్తాయి. పెరుగులో కొబ్బరి ముక్కను వేసుకుంటే పెరుగు చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. వంటి గదిని శుభ్రం చేసుకునేటప్పుడు పసుపుని కలిపిన నీటితో చేసుకుంటే ఈగలు, దోమలు వంటివి ముసరకుండా ఉంటాయి.
కాకరకాయ చేదు తొలగిపోలాంటే వాటిని కట్ చేసుకునేటప్పుడు ఉప్పును రాసుకుని నీళ్లు చల్లి గంటపాటు అలానే ఉంచుకుంటే చేదు పోతుంది.పప్పు త్వరగా ఉడకాలంటే అందులో కొద్దిగా నూనెను వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది.
కందిపప్పు పాడవకుండా ఉండాలంటే ఆ డబ్బాలో కొబ్బరి చిప్పను ఉంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంగువ డబ్బాలో పచ్చిమిరపకాయను వేసుకుంటే ఇంగువ చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇంట్లో బొద్దింకలో బాధపడుతున్నవారు ఉల్లిపాయలను మెత్తగా రుబ్బుకుని బొద్దింకలు వచ్చే ప్రాంతాలలో ఉంచితే బొద్దింకలు రావు.