Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రిజ్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు, కూరగాయలు లేకుండా ఉంచుకోకూడదు. ఫ్రిజ్ లోపల గాలి ప్రసరించేలా కొంత ఖాళీ ఉండేలా చూడాలి. తొడిమలు తీసిన మిరపకాయలను ఎక్కవ రోజులు ఫ్రిజ్‌లో ఉంచితే అవి కుళ్ళిపోతాయి. కనుక పచ్చిమిరపకాయ

Advertiesment
cleaning
, సోమవారం, 20 ఆగస్టు 2018 (11:36 IST)
ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు, కూరగాయలు లేకుండా ఉంచుకోకూడదు. ఫ్రిజ్ లోపల గాలి ప్రసరించేలా కొంత ఖాళీ ఉండేలా చూడాలి. తొడిమలు తీసిన మిరపకాయలను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచితే అవి కుళ్ళిపోతాయి. కనుక పచ్చిమిరపకాయలను తొడిమలు తీయకుండా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఫ్రీజర్‌లో ఐస్ గడ్డలుగా పేరుకోకుండా చూసుకోవాలి. 
 
ఎక్కవ మందంగా ఐస్ పేరుకున్నట్లైతే వెంటనే ఫ్రిజ్‌ను ఆఫ్‌చేసి డీఫ్రాస్టింగ్ చేయాలి. ఫ్రిజ్ బయట భాగాన్ని వెనిగర్‌తో తుడుచుకుంటే తళతళ మెరుస్తుంది. ఫ్రిజ్‌లో ఐస్‌ట్రేలు పెట్టేటప్పుడు ఆవనూనెను రాసుకుంటే ట్రేలు అతుక్కోవు. పుట్టగొడుగులు పేపరు బ్యాగ్స్‌లో నిల్వ చేసుకుని ఉంచుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. సోడా సీసాలు ఫ్రిజ్‌లో ఉంచుకూడదు. అలా ఉంచితే ఎక్కువ చల్లబడి పేలుతాయి. 
 
సీసాలు శుభ్రంచేసుకునే బ్రష్‌తో ఫ్రిజ్ వెనుకవైపు గ్రిల్ భాగాన్ని సులభంగా శుభ్రం చేసుకోవచ్చును. ఆకుకూరలు వేళ్ళను కత్తిరించి తడిపోయేలా ఆరబెట్టుకుని కట్టను విడదీసి పాలిథిన్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, రుబ్బిన పిండి వంటివి ఫ్రిజ్‌లో ఉంచితే పాత్రలకు మూత పెట్టుకోవాలి. ఫ్రిజ్ డోర్ హ్యాండిల్‌కు కవర్‌ వేసుకోవాలి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్జరీ లేకుండానే ఆర్ఎఫ్ విధానంతో బోన్ ట్యూమర్‌ల తొలగింపు