ఉప్పును మూటలా కట్టి ఇంటి మూలలో పెట్టుకుంటే?
వర్షాకాలం వచ్చిందంటే చాలు బట్టలు ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారిపోతుంది. ఆరబెట్టి అల్మారాల్లో పెట్టిన బట్టలు చల్లదనానికి వాసన వస్తూనే ఉంటాయి. అటువంటి దుర్వాసన ఇల్లంతా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ చిట్కాలు పాటిస
వర్షాకాలం వచ్చిందంటే చాలు బట్టలు ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారిపోతుంది. ఆరబెట్టి అల్మారాల్లో పెట్టిన బట్టలు చల్లదనానికి వాసన వస్తూనే ఉంటాయి. అటువంటి దుర్వాసన ఇల్లంతా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ చిట్కాలు పాటిస్తే ఇంట్లో దుర్వాసనలను తగ్గించవచ్చును. దుర్వాసనకు ముఖ్యాకారణం సూక్ష్మజీవులు, ఫంగస్. ఇంటి దుర్వాసను తొలగించుకోవడానికి నిమ్మరసం చక్కగా ఉపయోగపడుతుంది.
బట్టలను ఉతికిన తరువాత నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని దుస్తులను ఆ నీళ్ళలో ముంచి ఆరేయాలి. ఇలా చేయడం వలన బట్టల నుండి దుర్వాసనలు రావు. అంతేకాకుండా నిమ్మరసాన్ని నీటిలో కలుపుకుని ఇంటి గదులను కూడా శుభ్రం చేసుకోవచ్చును. తద్వారా ఇంట్లోని దుర్వాసనలు కూడా తొలగిపోతాయి. వెనిగర్‌కు కూడా ఫంగస్‌ను నిర్మూలించే శక్తి అధికంగా ఉంటుంది.
నీటిలో కొద్దిగా వెనిగర్‌ను కలుపుకుని ఇల్లంతా చల్లుకుని తుడుచుకుంటే దుర్వాసనలు తొలగిపోయి మంచి వాసనను పొందవచ్చును. వంటసోడాలో కొద్దిగా నీటిని కలుపుకుని దుర్వాసన వచ్చే స్థాలలో చల్లుకుంటే కూడా ఇకపై అలాంటి దుర్వాసనలు రావు. కొద్దిగా ఉప్పును బట్టలో మూటలా కట్టుకుని ఇంట్లో దుర్వాసన వచ్చే చోటు ఉంచుకుంటే దుర్వాసన రాదు.