Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముఖాన్ని ఐస్ ముక్కలతో మర్దనా చేసుకుంటే?

కళ్లకి కాటుక పెట్టుకోవడం వలన అమ్మాయిల అందం మరింత పెరిగిపోతుంది. కళ్లు ఏ ఆకారంలో ఉన్నా కాటుక పెట్టగానే ఆకర్షణీయంగా కనబడుతాయి. కళ్లు నలపడం, చెమట ఇతరత్రా సమస్యల వలన కాటుక చెరిగిపోయి కంటి చుట్టూ నల్లగా తయారవుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కాటుక పెట్టుకునేటప

ముఖాన్ని ఐస్ ముక్కలతో మర్దనా చేసుకుంటే?
, గురువారం, 2 ఆగస్టు 2018 (14:42 IST)
కళ్లకి కాటుక పెట్టుకోవడం వలన అమ్మాయిల అందం మరింత పెరిగిపోతుంది. కళ్లు ఏ ఆకారంలో ఉన్నా కాటుక పెట్టగానే ఆకర్షణీయంగా కనబడుతాయి. కళ్లు నలపడం, చెమట ఇతరత్రా సమస్యల వలన కాటుక చెరిగిపోయి కంటి చుట్టూ నల్లగా తయారవుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కాటుక పెట్టుకునేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి.

 
ముఖ్యంగా ఏ రకమైన మేకప్ వేసుకోవాలన్నా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై, కళ్లపై ఏమాత్రం తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాతే కాటుక పెట్టుకోవాలి. మీ చర్మానికి ఎక్కువగా చెమటపట్టే గుణముంటే ఐస్ ముక్కలతో ముఖాన్ని మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన చెమట పట్టడం తగ్గుతుంది. అంతేకాకుండా కాటుక చెదరకుండా ఉంటుంది.  
 
కాటుక పెట్టుకునే ముందు కాటన్ వస్త్రంతో కనురెప్పలను శుభ్రంగా తుడుచుకోవాలి. కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా పోయిన తరువాత మాత్రమే కాటుక పెట్టుకోవాలి. ఫేస్ పౌడర్ వాడడం ద్వారా కూడా కాటుక చెరిగిపోకుండా చేయవచ్చును. ఈ పౌడర్ వేసుకోవడం వలన జిడ్డు తొలగిపోయి కళ్లు తాజాగా మారుతాయి. కళ్లకి కాటుక పెట్టుకునే ముందు కళ్లకి లైట్ కలర్ ఐ షాడోని బేస్‌గా వేసుకోవాలి.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రొకోలి ఆమ్లెట్ తయారీ విధానం....