ఆకుకూరలను పప్పులో కలిపి వండితే?
ఆకుకూరలను వర్షాకాలం వండేటప్పుడు రెండు మూడుసార్లు కడగాలి. ఉప్పు కాస్త చేర్చి శుభ్రపరచడం ద్వారా చిన్న క్రిములు నశిస్తాయి. అలాగే ఆకుకూరలను వండే సమయంలో మూత పెట్టి వండటం ద్వారా పూర్తి పోషకాలు లభిస్తాయి. ప్
ఆకుకూరలను వర్షాకాలం వండేటప్పుడు రెండు మూడుసార్లు కడగాలి. ఉప్పు కాస్త చేర్చి శుభ్రపరచడం ద్వారా చిన్న క్రిములు నశిస్తాయి. అలాగే ఆకుకూరలను వండే సమయంలో మూత పెట్టి వండటం ద్వారా పూర్తి పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఆకుకూరలు ఉడికించిన తర్వాత ఆ నీటిని పారేయకుండా ఉప్పు, నిమ్మరసం కలిపి సూప్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకుకూరల్లో రోజుకో రకం బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, తోటకూర, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూరను ఎక్కువగా వాడాలి.
ఆకుకూరలను పప్పులో కలిపి వండడం వలన పోషకపదార్థాలు బాగా లభించి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆకు కూరలను విడిగా వండేటప్పుడు నీళ్లతో ఉడికించి వండాలి. నూనె ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.