Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్షాకాలంలో బెండకాయల్ని తింటే.. ఎంత మేలో తెలుసా?

వర్షాకాలంలో బెండకాయల్ని అధికంగా ఉపయోగించాలి. ఆస్తమాకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలం, చలికాలంలో ఆస్తమా బాధితులకు బెండకాయ ఎంతగానో సహకరిస్తుంది. అలాంటివారు డైట్‌లో బెండకాయను చేర్చుకోవడం ద్వ

Advertiesment
వర్షాకాలంలో బెండకాయల్ని తింటే.. ఎంత మేలో తెలుసా?
, బుధవారం, 22 ఆగస్టు 2018 (12:21 IST)
వర్షాకాలంలో బెండకాయల్ని అధికంగా ఉపయోగించాలి. ఆస్తమాకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలం, చలికాలంలో ఆస్తమా బాధితులకు బెండకాయ ఎంతగానో సహకరిస్తుంది. అలాంటివారు డైట్‌లో బెండకాయను చేర్చుకోవడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే ఆస్తమా వ్యాధిగ్రస్థులు భోజనంలో ఏదో ఒక రూపంలో రెగ్యులర్‌గా బెండను తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. 
 
అలాగే వేడికి గురైన శరీరాన్ని చల్లబరిచే గుణం బెండకు ఉంది. అలాగే అధిక బరువును నియంత్రిస్తుంది. గంటల పాటు కూర్చునే ఉద్యోగం చేసేవారికి బెండ ఎంతో మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. శరీరంలోని చెడు కొవ్వులను శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త పడుతుంది.
 
బెండకాయ రసంలో ఇన్సులిన్ గుణాలను కలిగి ఉండే సమ్మేళనాలు వుండటం వల్ల మధుమేహం వ్యాధిని నియంత్రించుకోవచ్చు. బెండకాయ రసాన్ని రోజు తాగటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఎసిడిటీ, అల్సర్ల, గ్యాస్ బాధితులు పచ్చి బెండకాయ తింటే బెండకాయ జిగురు జీర్ణకోశానికి లోపల పొరగా ఏర్పడి ఉపశమనం కలుగుతుంది. 
 
బెండకాయ తినడం ద్వారా మూత్ర సంబంధిత, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. గర్భిణులు, శిశువు నాడీవ్యవస్థ వృద్ధికి మేలు చేస్తుంది. మెదడు చురుకుగా వుండేలా చేస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధిక బరువు తగ్గాలంటే ఇలా చేయండి...