Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అధిక బరువు తగ్గాలంటే ఇలా చేయండి...

అధిక బరువుతో అనేకమంది బాధపడుతుంటారు. ఈ అధిక బరువును తగ్గించేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. నిజానికి అధిక బరువుతో బాధపడేవారు చిన్నపాటి చిట్కాలను పాటించినట్టయితే ఖచ్చితంగా అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కవచ్

అధిక బరువు తగ్గాలంటే ఇలా చేయండి...
, బుధవారం, 22 ఆగస్టు 2018 (11:46 IST)
అధిక బరువుతో అనేకమంది బాధపడుతుంటారు. ఈ అధిక బరువును తగ్గించేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. నిజానికి అధిక బరువుతో బాధపడేవారు చిన్నపాటి చిట్కాలను పాటించినట్టయితే ఖచ్చితంగా అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
 
* ప్రతి రోజూ మితంగా అల్పాహారం తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ అల్పాహారం మానెయ్యరాదు. అల్పాహారం మానెయ్యడం వల్ల బరువు తగ్గకపోగా, పెరుగుతారు. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి.
* బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా మద్యానికి దూరంగా ఉండాలి. మద్యం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి.. బరువును పెంచుతుంది. 
* వేగంగా బరువు తగ్గేందుకు తిండి మానేస్తుంటారు. ఇలా చేయరాదు. శరీరానికి రోజువారీ అవసరం అయ్యే శక్తిని ఇవ్వడం కోసం మనం రోజూ నిర్దిష్టమైన పరిమాణంలో ఆహారాన్ని తీసుకోవాలి. వేళకు పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. 
 
* జంక్ ఫుడ్స్ తినడం మానేయాలి. వీటి స్థానంలో సీజనల్ పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, నట్స్, చేపలు, పాలు తదితర ఆహారాలను తీసుకుంటే శరీరానికి సంపూర్ణ పోషణ అందుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
* ప్యాకింగ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అలాగే, డైట్ ఫుడ్స్‌ను తీసుకోకపోవడమే ఉత్తమం.
* వ్యాయామం చేసే వారు ఆహారం కూడా సరిగ్గా తీసుకోవాలి. రోజూ తాము చేసే పనిని బట్టి ఎన్ని క్యాలరీలనిచ్చే ఆహారం అవసరం అవుతుందో అంతే తినాలి. 
 
* కొవ్వు పదార్థాలను తింటే బరువు అధికంగా పెరుగుతారనే అపోహ చాలా మందిలో ఉంది. ఇది తప్పు. నిజానికి అన్ని రకాల కొవ్వులు అలా కాదు. కొన్ని కొవ్వు పదార్థాలు మన బరువును తగ్గిస్తాయి. నెయ్యి, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె తదితర నూనెలు బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. అందువల్ల మనం తీసుకునే ఆహారంతో మితంగా వీటిని తీసుకోవడం ఉత్తమం. 
* వీటన్నింటి కంటే వేళకు నిద్రపోవడం, నిత్యం వ్యాయామం చేయడం, సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డయాబెటిస్ సమస్య వున్నవారు ఇవి పాటిస్తే చాలంతే...