Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్త స్థానంలో నకిలీ... తెలంగాణ గృహిణిని రోడ్డున పడేశారు...

రైతు బీమా పథకం అంటూ కొంతమంది తమ వద్దకు వచ్చి ఫోటోకు తన భర్త, బిడ్డతో సహా ఫోజివ్వమని తెలంగాణలోని ఓ గృహిణిని కోరారు. అంతే... ఆ తర్వాత ఆ ఫోటోతో జిమ్మిక్కులు చేసి ఆమెను రోడ్డున పడేశారు. రైతుబీమా, కంటి వెలుగు పథకాలను తెలంగాణ సర్కారు చేపట్టిన సంగతి తెలిసిం

భర్త స్థానంలో నకిలీ... తెలంగాణ గృహిణిని రోడ్డున పడేశారు...
, సోమవారం, 20 ఆగస్టు 2018 (22:01 IST)
రైతు బీమా పథకం అంటూ కొంతమంది తమ వద్దకు వచ్చి ఫోటోకు తన భర్త, బిడ్డతో సహా ఫోజివ్వమని తెలంగాణలోని ఓ గృహిణిని కోరారు. అంతే... ఆ తర్వాత ఆ ఫోటోతో జిమ్మిక్కులు చేసి ఆమెను రోడ్డున పడేశారు. రైతుబీమా, కంటి వెలుగు పథకాలను తెలంగాణ సర్కారు చేపట్టిన సంగతి తెలిసిందే. లక్షలాది రైతులకు బాసటగా నిలిచిన ఈ పథకంలో ఓ రైతు కుటుంబం బొమ్మ ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఈ పథకాల కోసం ఉపయోగిస్తున్న ప్రింట్ యాడ్లు ఓ వివాహిత జీవితాన్ని చిందరవందర చేశాయి.
 
ఈ రైతు బీమా తెలుగు యాడ్‌లో భర్తతో మహిళ ఫోటో వుండగా, ఇంగ్లీష్ పేపర్లో మాత్రం వివాహిత భర్త స్థానంలో వేరొకరిని ప్రింట్ చేయడం ప్రస్తుతం సదరు మహిళకు ఇబ్బందులను కొనితెచ్చిపెట్టింది. ఆమె భర్త స్థానంలో మరొక వ్యక్తిని పెట్టడంపై కాపురంలో కుంపట్లను రాజేసినట్లైంది. తెలుగు వార్తా పత్రికల్లో వచ్చిన యాడ్లలో ఆమె పక్కన ఆమె భర్తే వున్నప్పటికీ.. ఇంగ్లీష్ పత్రికలకు ఇచ్చిన ప్రకటనలో మాత్రం ఆమె భర్త స్థానంలో వేరొక వ్యక్తి వున్నాడు. ఇది వారి కాపురంలో అశాంతికి కారణమైంది. 
webdunia
 
భార్యాభర్తల మధ్య వాగ్వాదాలకు దారితీసింది. అంతేకాకుండా బంధువులు కూడా సదరు మహిళను సూటిపోటి మాటలతో హింసించసాగారు. ఈ వ్యవహారంపై సదరు మహిళ మీడియా ముందు తన ఆవేదనను వెలిబుచ్చింది. తన పక్కన వేరే వ్యక్తిని భర్తగా ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రచార, సమాచార శాఖ రంగంలోకి దిగింది. ఇందుకు కారణమైన రెండు ఏజెన్సీలను వివరణ ఇవ్వాలంటూ కోరుతూ నోటీసులు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరులో కొండచిలువ- మూడు కోళ్ళను మింగేసింది..