Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త పూల వర్షం కురిపిస్తుంటే.. సీమంతానికి అదిరిపోయే స్టెప్పులేసిన నటి

రంభ.. ఒకపుడు టాలీవుడ్‌లోనేకాకుండా తమిళ, మలయాళం, భోజ్‌పురిలలో టాప్ హీరోయిన్. ఇండస్ట్రీలో ఉన్న అగ్రహీరోలందరితోనూ నటించింది. ఆ తర్వాత వెండితెరకు గుడ్‌బై చెప్పి కెనడాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రన్‌

Advertiesment
భర్త పూల వర్షం కురిపిస్తుంటే.. సీమంతానికి అదిరిపోయే స్టెప్పులేసిన నటి
, మంగళవారం, 14 ఆగస్టు 2018 (16:36 IST)
రంభ.. ఒకపుడు టాలీవుడ్‌లోనేకాకుండా తమిళ, మలయాళం, భోజ్‌పురిలలో టాప్ హీరోయిన్. ఇండస్ట్రీలో ఉన్న అగ్రహీరోలందరితోనూ నటించింది. ఆ తర్వాత వెండితెరకు గుడ్‌బై చెప్పి కెనడాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రన్‌ను పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. ఈ వివాహం 2010లో జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారి పేర్లు లాన్య (7), శాషా (3). ఇపుడు ముచ్చటగా మూడోసారి తల్లి అయింది.
 
అయితే సోమవారం రంభ శ్రీమంతాన్ని వారి కుటుంబ సభ్యులు ఘ‌నంగా జ‌రిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంతో సంతోషంగా ఉన్న రంభ త‌న బంధువుల‌తో క‌లిసి స్టెప్పులు వేసింది. రంభ భ‌ర్త ఆమెపై పూల వ‌ర్షం కురిపించారు. రంభ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీమంతంకి సంబంధించిన ఫోటోలు షేర్ చేయ‌గా ప్ర‌స్తుతం అవి వైర‌ల్ అవుతున్నాయి. 
 
కాగా, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా 2016లో తన భర్త నుంచి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కింది. తన పిల్లల సంరక్షణ కోసం నెలకు రూ.2.50 లక్షలు చెల్లించాలని కోర్టును కోరింది. అయితే కొంతకాలంగా ఈ కేసుపై సుదీర్ఘ చర్చ జరిపిన కోర్టు ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు రావాల్సిందిగా కోరింది. ఈ క్రమంలో రంభ, ఆమె భర్త మాట్లాడుకొని, కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.
webdunia
 
ఈ విషయాన్ని రంభ‌ కోర్టుకు తెలపడంతో జడ్జి విడాకుల కేసును మూసివేస్తున్నట్లుగా ఆ మధ్య ప్రకటించారు. ప్ర‌స్తుతం త‌న భ‌ర్తతో క‌లిసి హ్యాపీగా ఉంటున్న రంభ త్వ‌ర‌లో మ‌రో బేబీకి జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బయోపిక్ : చంద్రబాబు సతీమణి భువనేశ్వరిగా ఎవరంటే?