Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చి.ల.సౌ డైరెక్ట‌ర్ రాహుల్ నెక్ట్స్ మూవీ హీరో ఎవ‌రో తెలుసా?(వీడియో)

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌తో రాహుల్ ర‌వీంద్ర‌న్ సినిమా తీస్తున్నాడ‌ని ఎనౌన్స్ చేసిన‌ప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో అనుకున్నారు. తీరా సినిమా పూర్తి చేసి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసేస‌రికి సీన్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే... రాహుల్ ఫ‌స్ట్ లుక్‌తోనే ఇం

Advertiesment
చి.ల.సౌ డైరెక్ట‌ర్ రాహుల్ నెక్ట్స్ మూవీ హీరో ఎవ‌రో తెలుసా?(వీడియో)
, మంగళవారం, 31 జులై 2018 (21:38 IST)
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌తో రాహుల్ ర‌వీంద్ర‌న్ సినిమా తీస్తున్నాడ‌ని ఎనౌన్స్ చేసిన‌ప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో అనుకున్నారు. తీరా సినిమా పూర్తి చేసి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసేస‌రికి సీన్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే... రాహుల్ ఫ‌స్ట్ లుక్‌తోనే ఇంప్రెస్ చేసాడు కాబ‌ట్టి. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. నాగ చైత‌న్య‌, స‌మంత క‌లిసి ఈ సినిమాని చూడ‌డం.. ఈ సినిమా చాలా బాగుందని.. ఒక్క‌సారి చూడ‌మ‌ని నాగార్జున‌కు చెప్ప‌డం... నాగ్ సినిమా చూసి కేవ‌లం బాగుంద‌ని చెప్ప‌డ‌మే కాకుండా త‌మ సంస్థ ద్వారా రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం తెలిసిందే.
 
రాహుల్ టాలెంట్‌ను గుర్తించిన నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోలో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చార‌ట‌. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రాహుల్ నెక్ట్స్ మూవీలో హీరో నాగచైత‌న్య అని ప్ర‌చారం మొద‌లైంది. అయితే... ఈ సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా మీడియాతో మాట్లాడిన రాహుల్‌ని త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో ఉంటుంది..? నాగ చైత‌న్య అని ప్ర‌చారం జ‌రుగుతుంది నిజ‌మేనా అని అడిగితే.. అందులో వాస్త‌వం లేదు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్లో ఉంటుంది అనేది మాత్రం క‌న్‌ఫ‌ర్మ్. హీరో ఎవ‌ర‌నేది మాత్రం ఇంకా ఫైన‌లేజ్ కాలేదు అని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే.. రాహుల్, నాగార్జున కోసం క‌థ రెడీ చేసార‌ని మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి.. రాహుల్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది చిలసౌ రిలీజ్ త‌ర్వాత ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. వీడియో చూడండి... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ హౌస్‌లోకి హిజ్రా కమ్ నటి.. ఎవరు? (Video)