Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చి.ల.సౌ రిజల్ట్ చూసి రాహుల్ త‌దుప‌రి చిత్రంలో హీరో నిర్ణయమట...

అందాల రాక్షసి చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయ‌మై న‌టుడుగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ న‌టుడు రాహుల్‌ రవీంద్రన్‌. ఆ తర్వాత గాలిపటం, అలా ఎలా, టైగర్‌, శ్రీమంతుడు తదితర చిత్రాల్లో నటించినా న‌టుడుగా ఆశించిన స్థాయిలో స‌క్స‌స్ కాలేద‌నే చెప్ప

Advertiesment
ChiLaSow
అందాల రాక్షసి చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయ‌మై న‌టుడుగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ న‌టుడు రాహుల్‌ రవీంద్రన్‌. ఆ తర్వాత గాలిపటం, అలా ఎలా, టైగర్‌, శ్రీమంతుడు తదితర చిత్రాల్లో నటించినా న‌టుడుగా ఆశించిన స్థాయిలో స‌క్స‌స్ కాలేద‌నే చెప్ప‌చ్చు. అయితే... తనకు నటన కంటే దర్శకుడు అవ్వాలన్న కోరికే ఎక్కువగా ఉందట‌. దీంతో ద‌ర్శ‌కుడిగా మారి చేసిన  తొలి ప్ర‌య‌త్నం చి.ల.సౌ. ఇందులో సుశాంత్‌, రుహాని శర్మ జంటగా నటించారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.
 
ఇదిలా ఉంటే... ఈ సినిమా త‌ర్వాత రాహుల్ అన్న‌పూర్ణ స్టూడియో బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని రాహుల్ మ‌రియు అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా ఎనౌన్స్ చేసారు. అయితే.. రాహుల్ త‌దుప‌రి చిత్రంలో నాగచైత‌న్య హీరో అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే విష‌యం గురించి రాహుల్‌ని అడిగితే... ఆ విష‌యాన్ని మరో నెలలో తెలియజేస్తాం అన్నాడు. మ‌రోవైపు చిల‌సౌ రిలీజ్ త‌ర్వాత ఈ సినిమా రిజెల్ట్‌ను బ‌ట్టి హీరో ఎవ‌ర‌నేది నిర్ణ‌యిస్తారు అని టాక్ వినిపిస్తోంది. సో... రాహుల్ నెక్ట్స్ మూవీ హీరో ఎవ‌రో తెలియాలంటే నెల రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''శ్రీదేవి''గా రకుల్ ప్రీత్ సింగ్.. బయోపిక్‌లోనా?