Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుశాంత్ చి.ల.సౌ వాయిదా..? కారణం..?

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం చి.ల.సౌ. ఈ చిత్రం ద్వారా హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో సుశాంత్‌, రుహాని శర్మ జంటగా నటించారు. టీజ‌ర్‌తో ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. దీనికితోడు

Advertiesment
సుశాంత్ చి.ల.సౌ వాయిదా..? కారణం..?
, గురువారం, 19 జులై 2018 (18:38 IST)
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం చి.ల.సౌ. ఈ చిత్రం ద్వారా హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో సుశాంత్‌, రుహాని శర్మ జంటగా నటించారు. టీజ‌ర్‌తో ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. దీనికితోడు ఈ సినిమా క‌థ.. దీనిని తెర‌కెక్కించిన విధానం న‌చ్చ‌డంతో అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ముందుకు వ‌చ్చింది. 
 
అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఈ సినిమాని ప్ర‌మోట్ చేస్తుండ‌డం.. పాజిటివ్ టాక్ ఉండ‌టంతో ఓవ‌ర్సీస్‌లో కూడా ఈ సినిమాకి క్రేజ్ ఏర్ప‌డింది. అయితే... ఈ సినిమాని ఈ నెల 27న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ.. అదే రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ తెర‌కెక్కించిన సాక్ష్యం సినిమా రిలీజ్ కానుంది. మ‌రోవైపు మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక న‌టించిన హ్యాపీ వెడ్డింగ్ కూడా అదే రోజు రిలీజ్‌కి రెడీ అవుతోంది. 
 
అందుచేత వీటితో పోటీప‌డి రిలీజ్ చేయ‌డం కంటే ఆ త‌ర్వాత వారంలో రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌. అందుచేత సుశాంత్ చి.ల.సౌ ఆగ‌స్టు 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెరపై దంపతులుగా సమంత-చైతూ... ముహూర్తం కుదిరింది?