Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డయాబెటిస్ సమస్య వున్నవారు ఇవి పాటిస్తే చాలంతే...

సాధారణంగా మధుమేహంతో బాధపడేవారు రకరకాల మందులను వాడుతుంటారు. ఈ మందులను దీర్ఘకాలంగా వాడటం వలన కొన్నాళ్లకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది కనుక వీరు తినే ఆహారంలో మార్పు చేసుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అది ఎలాగో చూద్దాం.

Advertiesment
డయాబెటిస్ సమస్య వున్నవారు ఇవి పాటిస్తే చాలంతే...
, మంగళవారం, 21 ఆగస్టు 2018 (23:03 IST)
సాధారణంగా మధుమేహంతో బాధపడేవారు రకరకాల మందులను వాడుతుంటారు. ఈ మందులను దీర్ఘకాలంగా వాడటం వలన కొన్నాళ్లకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది కనుక వీరు తినే ఆహారంలో మార్పు చేసుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అది ఎలాగో చూద్దాం.
 
1. మన శరీరానికి  నీరు చాలా అవసరం.  ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్లలో ఒంట్లో నీరు తగ్గిపోతే  తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తుంది. కనుక వీరు సాధ్యమైనంత ఎక్కువుగా నీరు తాగుతూ ఉండాలి.
 
2. పాలు, పెరుగు వంటి పాల పదార్ధాలను తీసుకోవచ్చు గానీ కొవ్వు ఎక్కువుగా ఉండే బటర్, చీజ్, నెయ్యిలకు దూరంగా ఉండటం మంచిది.
 
3. రోజుకి కనీసం మూడు సార్లయినా తాజా కూరగాయలు తీసుకోవాలి. క్యాబేజీ, పుదీనా, పాలకూర, కాకరకాయ, బెండకాయ, కాలీఫ్లవర్, దోసకాయ, క్యారెట్, ముల్లంగి, ఉల్లికాడలు, గుమ్మడికాయ మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి.
 
4. తాజా పండ్లు తినటమూ మంచిదే. వీటిలో సహజంగా ఉండే చక్కెర సుక్రోజ్ కన్నా నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయితే చాలా తీయగా ఉండే మామిడి, అరటి వంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలాంటి పండ్లను భోజనం చేసిన వెంటనే తింటే రక్తంలో గ్లూకోజ్ త్వరగా పెరుగుతుంది. 
 
5. మధుమేహం ఉన్న వాళ్లు ఎట్టి పరిస్ధితులలోను ఆహారం తినటాన్ని మానేయటం మంచిదికాదు. ప్రతిరోజు ఒకే సమయంలో భోజనం చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థిరంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
 
6. కేకులు, మిఠాయిలు, చాక్లెట్లు వంటి అధిక చక్కెర గల పదార్ధాలకు దూరంగా ఉండాలి. తీయటి పానీయాల జోలికి వెళ్లకపోవటం మంచిది.
 
7. ఎక్కువ నూనెతో వేయించే పదార్ధాలకన్నా ఉడికించినవి తినటం ఎంతో మంచిది. అలాగే అన్నం, ఆలుగడ్డ, అరటి వంటివి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటివి పెద్దమెుత్తంలో తినకుండా చూసుకోవాలి.
 
8. మధుమేహులకు రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటం అన్ని విధాలా మంచిది. 
 
9. అన్నింటికన్నా ముఖ్యంగా రోజులో ఎప్పుడైనా సరే .. ఆహారాన్ని ఒకేసారి పెద్దమెుత్తంలో తినకుండా జాగ్రత్తపడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుత్తివంకాయ కూర తింటే.. కొలెస్ట్రాల్ పరార్..