Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వానాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి?

అనేక మంది ఆహార ప్రియులు వేసవి కాలంలో ఆరగించినట్టుగానే వానా కాలంలో కూడా తమకు నచ్చిన వాటిని ఫుల్‌గా లాగించేస్తుంటారు. అలా చేయడం వల్ల వర్షాకాలంలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అందువల్ల వానా కాలంలో ఎలాంట

Advertiesment
Foods
అనేక మంది ఆహార ప్రియులు వేసవి కాలంలో ఆరగించినట్టుగానే వానా కాలంలో కూడా తమకు నచ్చిన వాటిని ఫుల్‌గా లాగించేస్తుంటారు. అలా చేయడం వల్ల వర్షాకాలంలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అందువల్ల వానా కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
 
* కొవ్వు అధికంగా ఉండే సమోసా, పకోడీలు, వేపుళ్లు, బర్గర్లు, అధికంగా ఉప్పు ఉండే పచ్చళ్లు, ఊరగాయలు, చట్నీలు తినడం మానేయాలి. 
* అజీర్ణ సమస్యలకు దారితీసే బంగాళా దుంపలు, కందులు, గోరుచిక్కుడు, మొలకెత్తిన గింజలు వంటివి తినకపోవడం మంచిది. 
* ఆవ, నువ్వుల నూనెలకి బదులు మొక్కజొన్న, ఆలివ్‌ నూనెలు వాడితే జీర్ణ సమస్యలు ఉత్పన్నంకావు. 
* పళ్లరసాలు, చెరకు రసాలు, లస్సీ, పెరుగు వంటివి వాడకపోవడం మంచిది. 
 
* రెస్టారెంట్లు, పార్టీలు, ఫంక్షన్లలో ఆకుకూరల వంటకాలు, సలాడ్‌లకు దూరంగా ఉంటే మంచిది. 
* తోపుడు బండ్లపై ముక్కలు చేసి విక్రయించే పుచ్చకాయ, కీర, పైనాపిల్ వంటి పండ్లను ఆరగించరాదు. 
* వర్షాకాలంలో పచ్చిగుడ్డుతో పాటు.. సీ ఫుడ్స్‌కు వీలైనంత మేరకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైంగికోద్రేకాన్ని పెంచే ఫోర్‌ప్లే లేకుంటే దాంపత్య జీవితం తుస్సేనట...