Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్నెల్లకోసారి దంతవైద్యుడుని సంప్రదించాలి.. లేకుంటే...

దంతాల సంరక్షణతో పాటు వాటి ఆరోగ్యం చాలా ముఖ్యం. వీటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే, ఇటీవలి కాలంలో దంతాలకు సంబంధించిన అవగాహన బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువమం

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (14:01 IST)
దంతాల సంరక్షణతో పాటు వాటి ఆరోగ్యం చాలా ముఖ్యం. వీటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే, ఇటీవలి కాలంలో దంతాలకు సంబంధించిన అవగాహన బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువమంది డయాబెటిక్ రోగులు ఈ దంత సమస్యల బారినపడుతున్నారు. అందుకే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
 
* ప్రతిరోజూ రెండు సార్లు పళ్లు తోముకోవాలి. (రాత్రి నిద్రకు ముందు, పొద్దున్న నిద్ర లేవగానే)
*  బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడాలి.
* మంచి టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవాలి.
 
* పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకూ నిలువుగా బ్రష్ చేసుకోవాలి.
* రఫ్‌గా బ్రష్ చేసుకుంటే చిగుళ్లకు హాని కలుగుతుంది. దీంతో చిగుళ్లు త్వరగా వ్యాధులకు గురవుతాయి.
* పంటికి బయటవైపే కాదు లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాల్లో పంటి పైన వెడల్పుగా ఉండే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి.
*  కనీసం రెండు నిముషాలపాటు బ్రష్ చేసుకోవాలి.
 
* నాలుకపైన ఉన్న బ్యాక్టీరియాను తొలగించుకోవడానికి 30 సెకన్లపాటు స్క్రబ్ చేయాలి.
* చేత్తో చిగుళ్లను మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగవుతుంది.
*  ప్రతి మూడు నెలలకు ఓ సారి బ్రష్‌ను మార్చేయాలి. 
 
* చిన్నపిల్లలు ఉన్నవారు ప్రతి 6 నెలలకోసారి వారిని డెంటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి.
* మధుమేహ రోగులు తప్పనిసరిగా దంత వైద్యులను క్రమం తప్పకుండా సంప్రదించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

రోడ్డు పక్కనే కారు ఆపాడు... ఆ పక్కనే కానిచ్చేశాడు (Video)

రెప్పపాటులో తప్పిన ప్రాణముప్పు... రైలు దిగుతుండగా (Video)

సిరియాలో చెలరేగిన అల్లర్లు - 745 మంది అమాయక పౌరులు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

తర్వాతి కథనం
Show comments