Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రీన్ టీని ఏ సమయంలో తీసుకోవాలో తెలుసా?

గ్రీన్ టీని ప్రతిరోజూ తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. గ్రీన్ టీని తీసుకోవడం అధిక బరువును తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ గ్రీన్ టీ శరీర రోగనిరోధక శక్తిని పెంచుటలో మంచి

Advertiesment
గ్రీన్ టీని ఏ సమయంలో తీసుకోవాలో తెలుసా?
, శుక్రవారం, 24 ఆగస్టు 2018 (10:30 IST)
గ్రీన్ టీని ప్రతిరోజూ తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. గ్రీన్ టీని తీసుకోవడం అధిక బరువును తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ గ్రీన్ టీ శరీర రోగనిరోధక శక్తిని పెంచుటలో మంచిగా సహాయపడుతుంది. ఇటువంటి గ్రీన్ టీని ఏ సమయాలలో తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.
 
గ్రీన్ టీని ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు తాగాలి. దీని వలన శరీర మెటబాలిజం పెరుగుతుంది. సాయంత్రం పూట 4 నుండి 6 గంటల సమయంలో తీసుకోవాలి. ఈ రెండు సమయాల్లో గ్రీన్ టీని తీసుకోవడం వలన క్యాలరీలకు చాలా మంచిది. గ్రీన్ టీని ఉదయాన్నే పరగడుపునే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకవేళ అలా తాగితే లివర్‌‌‌పై గ్రీన్ టీ హానికర ప్రభావాన్ని చూపుతుంది. 
 
రక్తహీనత ఉన్నవారు భోజనం చేశాక 2 గంటల తరువాత గ్రీన్ టీ తీసుకోవాలి. లేదంటే శరీరం ఐరన్‌ను గ్రహించలేదు. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందుగా గ్రీన్ టీని తీసుకోకూడదు. గ్రీన్ టీ వలన నిద్ర అస్తవ్యస్తమవుతుంది. నిద్రలేమితో బాధపడుతారు. గ్రీన్ టీని రోజుకు 2 లేదా 3 కప్పులు తీసుకోవాలి.     

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైబీపీకి కారణమైయ్యే ఆహార పదార్థాలు ఇవే...