దానిమ్మతో ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (11:36 IST)
చలికాలం వచ్చిందంటే.. ముఖం పొడిబారడం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వీటి కారణంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా చర్మ రక్షణ కోసం ఈ చిట్కాలు పాటిస్తే ప్రకాశవంతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..
 
దానిమ్మ ఫేస్‌ప్యాక్:
దానిమ్మలోని గింజలను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో స్పూన్ తేనె, కొద్దిగా పసుపు కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత రోజ్ వాటర్ ముఖానికి రాసుకోవాలి. ఆపై 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖం మృదువుగా, తాజాగా మారుతుంది.
 
టమాటో ఫేస్‌ప్యాక్:
ఈ చలికాలం కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండదు. దాంతో చర్మం పొడిబారుతుంది. ఈ పొడిబారిన చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చాలంటే.. ఏం చేయాలో చూద్దాం.. ఒక్క టమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్‌లా చేయాలి. ఇలా చేసిన పేస్ట్‌లో 2 స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే.. పొడిబారిన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
తేనె ఫేస్‌ప్యాక్:
చర్మంపై మృతుకణాలను తొలగించేందుకు తేనె చాలా ఉపయోగపడుతుంది. ఎలాగంటే.. 3 స్పూన్ల తేనెలో టీస్పూన్ పెరుగు, కొద్దిగా అరటిపండు గుజ్జు వేసి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే.. ముఖం కోమలంగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాత సిమ్ కార్డులు, ఈ వేస్ట్ నుంచి రూ.27లక్షల విలువైన బంగారం

Nara Lokesh: కోవా బన్ విక్రేత వలిని త్వరలో కలుస్తా.... మంత్రి నారా లోకేష్ (video)

మహా శివరాత్రి.. సామర్లకోటలో రికార్డ్ డ్యాన్సులు

Bill Gates: ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న బిల్ గేట్స్

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments