Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాఫీ పొడి, తేనెతో ప్యాక్..?

కాఫీ పొడి, తేనెతో ప్యాక్..?
, సోమవారం, 24 డిశెంబరు 2018 (17:01 IST)
ఇప్పటి కాలంలో ఎక్కడ చూసినా ఈ మొటిమ, మచ్చ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. వీటిని తొలగించుకోవడానికి ఏవేవో మందులు, క్రీమ్స్, ఫేస్‌ప్యాక్స్ వాడుతున్నారు. అయినను, కాస్త కూడా తేడా కనిపించలేదని బాధపడుతుంటారు. ఇలాంటి చిన్న చిన్న వాటికే ఆందోళన అవసరం లేదని చెప్తున్నారు బ్యూటీ నిపుణులు. మరి వీటిని తొలగించాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి. అవేంటో చూద్దాం..
 
1. పెరుగులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని తాజాగా మార్చుతాయి. పెరుగులో కొద్దిగా పసుపు, వంటసోడా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆ ప్యాక్ బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు లేదా మూడుసార్లు చేస్తే ముఖంపై గల మొటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 
 
2. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా పట్టించాలి. ఆపై 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 
3. కీరదోస రసాన్ని ముఖానికి పట్టించాలి. ప్యాక్ బాగా ఆరిన తరువాత ముఖాన్ని 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా రోజూ చేస్తే ముఖం మృదువుగా, ప్రకాశంతంగా మారుతుంది.
 
4. కాఫీ పొడి ఆరోగ్యానికి కాదు.. అందానికి కూడా బాగా పనిచేస్తుంది. ఎలాగంటే.. స్పూన్ కాఫీ పొడిలో కొద్దిగా తేనె, నిమ్మరసం, ముల్తానీ మట్టీ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఆపై ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండువారాలు చేస్తే చాలు.. ముఖం కోమలంగా తయారవుతుంది.
 
5. చందనంలో కొద్దిగా రోజ్‌వాటర్, నిమ్మరసం స్పూన్ పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారి.. నల్లటి మచ్చలు పోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాన్సర్ వ్యాధి ఎలా వస్తుందో తెలుసా..?